Wednesday, January 22, 2025

నీట్‌పై ఎన్‌డిఎ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం : కెటిఆర్

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థులను ప్రభావితం చేసే సున్నితమైన అంశాన్ని ఎన్‌డిఎ సర్కార్ పట్టించుకోవడం లేదని ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పరిష్కరించాల్సిన ఇంత పెద్ద సమస్యను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారని కెటిఆర్ అడిగారు. నీట్ విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ చేసిన వ్యాఖ్యలు, ఇతర వార్తా కథనాలను కెటిఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News