Monday, December 23, 2024

ఓ ప్రక్క రూపాయి విలువ పడిపోతుంటే…మోడీ ఫోటో కోసం యాగి చేస్తున్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

KTR

హైదరాబాద్: డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంపై రాష్ట్ర మంత్రి కెటిఆర్ స్పందించారు. “రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటో కోసం వెతుకుతున్నారు. పైగా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని అంటున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం…ఇలా అన్నీ ఆర్థిక అవరోధాలకు ‘ ఆ దేవుడి చర్యలే కారణమని’(యాక్ట్ ఆఫ్ గాడ్) దబాయిస్తున్నారు. విశ్వ గురువును పొగడండి” అంటూ ట్విట్టర్ ద్వారా చురకలంటించారు కెటిఆర్.

తెలంగాణకు గ్రామీణ స్వచ్ఛ మిషన్ అవార్డుల్లో ప్రథమ స్థానం రావడంపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో స్వచ్చ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, పంచాయతీ కార్యదర్శులకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు పోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News