Sunday, December 22, 2024

ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ పనుల్లో నిబంధనలు ఉల్లంఘించడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అంచనాలను పెంచారని హాహాకారాలు చేసినోళ్లు, అవినీతి జరిగిందని బురదజల్లిన వాళ్లు.. కాళేశ్వరం మీద కక్షగట్టి రైతుల పొట్టగొట్టినవాళ్లు..పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగం పట్టించినవాళ్లు.. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని నిలదీశారు.

సుద్దపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారని ప్రశ్నించారు. ఒక మీటింగ్‌లో త్వరగా టెండర్లు పిలవాలి అని ఆదేశిస్తారని.. మరో మీటింగ్‌లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడుతారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు పూర్తి అయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్‌లు వేసి విచారణ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడు ఏ కమిషన్ వెయ్యాలని నిలదీశారు. ఢిల్లీ నేస్తం.. అవినీతి హస్తం అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News