Thursday, March 6, 2025

ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలుసు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇంకొంతమంది మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతోనే ఎస్.ఎల్.బి. సి టన్నెల్ ప్రమాదం జరిగిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆరోపించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించిన రెండు నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ తమ సొంతలాభం కోసం టన్నెల్ పనులు కొనసాగించి ఎనిమిది మందిని బలిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల ప్రజాధనం వృథా చేయడంతో పాటు ఎనిమిది కుటుంబాల్లో ఎడతెగని శోకానికి కారణమైన ప్రమాదానికి రాష్ట్ర కేబినేట్ బాధ్యత వహిచాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టన్నెల్ పనులు చేస్తున్న జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ 2020లో అంబర్గ్ టెక్ ఏజి అనే సంస్థతో టన్నెల్ ప్రాంతంలో ఓ సర్వే నిర్వహించారని చెప్పారు. టన్నెల్ సిస్మిక్ ప్రెడిక్షన్ (టిఎస్‌పి) సర్వే చేసి మొన్నటి ప్రమాదాన్ని 2022లోనే అంబర్గ్ టెక్ ఏజి ఊహించి హెచ్చరించిందని అన్నారు.

టన్నెల్‌లోని 13.88 కి.మీ నుండి 13.91 కి.మీ మధ్య ఫాల్ట్ జోన్ ఉందని స్పష్టంగా చెప్పారని, ఆ ప్రాంతంలోని రాళ్లు ధృడంగా లేకపోవడంతో పాటు నీటి లీకేజీలు భారీగా ఉన్న సంగతిని హైలెట్ చేశారని తెలిపారు. ఆ రిపోర్ట్‌లో ఉన్నట్టుగానే మొన్నటి ప్రమాదం ఫాల్ట్ జోన్‌లోనే జరిగిందని అన్నారు. 2022లోనే జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ మండపల్లి రాజుతో పాటు జైప్రకాష్ అసోసియేట్స్ భూగర్భ శాస్త్రవేత్త రితురాజ్ దేశ్ముఖ్‌లు చేసిన మరో సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉందని పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రకారం టన్నెల్ ఉపరితలాన్ని సరిగా అంచనా వేయకుండానే నిర్మాణాన్ని మొదలుపెట్టారని చెప్పారు. ఎస్.ఎల్.బి.సి టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే చెప్పిన ఈ నివేదికలను రేవంత్ ప్రభుత్వం దాచి పెట్టి కార్మికులతో పనులు చేయించిందని ఆరోపించారు. ఈ రెండు నివేదికలపై ప్రభుత్వం స్పష్టతను ఇవ్వడంతో పాటు హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News