Saturday, February 1, 2025

రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, అంద్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్ధం అయిందని కెటిఆర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, తెలంగాణ నుంచి డీల్లీకి మూటలు మోసేందుకేనని తెలిపోయిందన్నారు. కాంగ్రెస్ సిఎంగా ఉంటూ బిజెపికి గులాంగిరీ చేస్తూన్న బడే భాయ్- చోటే భాయ్ అనుబందంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందని,

తెలంగాణ నుంచి మరో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా.. వారి వల్ల కూడా రాష్ట్రానికి దక్కింది గుండు సున్నానే అని పేర్కొన్నారు. కేవలం ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప.. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో తెలంగాణ గళం వినిపించిన పాపాన పోలేదని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి పోరాడిన దాఖలు లేకపోవడం వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కెటిఅర్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News