Friday, December 20, 2024

100 రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే.. కాంగ్రెస్ ను బొంద పెట్టుడే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

420 హామీలు చూసి తెలంగాణ ప్రజలు మోసపోయారని.. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం.. చేతల ప్రభుత్వం కాదని ప్రజలు తెలుసుకున్నారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా?… కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో గెలుపు మనదేనని.. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడేనన్నారు.100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను బొంద పెట్టుడేనని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నారని… చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతామన్నారు. మొన్నటి ఫలితాలు మన మంచికే వచ్చాయని అనుకుంటున్నానని.. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని.. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి తెలుస్తుందని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News