Wednesday, January 22, 2025

నాన్నతో దీక్ష విరమింపజేయాలని నాటి ఐజి బెదిరించారు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘట్టం ‘దీక్షా దివస్’ అని పేర్కొంటూ ఆ రోజున తన జీవితంలోనే మొదటిసారి తాను కూడా ఒక రోజు జైలులో గడిపా ను అని కెటిఆర్ గుర్తు చేసుకున్నారు. 2009, నవంబ ర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగిన పరిణామా లు గుర్తు చేసుకుని గురయ్యారు. కెసి ఆర్ అరెస్ట్ విషయం తెలిసి తాను నిరసనకు దిగడంతో పోలీసులు తనను అరెస్టు చేయగా, వరంగల్‌లో డిసిఎంలో నుంచి దూకి జయశంకర్ సార్ ఇంటికి వెళ్లానని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసి వరంగల్ జైలుకు తరలించారని అన్నారు. జైలులో కూడా అధికారులు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. అయితే తాను జైలులో ఉన్న సమయంలో తనకు షేవింగ్ చేయడానికి ఒక వ్యక్తి రాగా, షేవింగ్ చేస్తున్న సమయంలో అన్నా..మీది ఎక్కడా అని అడిగితే పులివెందుల అని సమాధానం చెప్పారని, దాంతో ఒక్కసారిగా కొంత అయోమయానికి గురయ్యారని గుర్తు చేసుకున్నారు.

మాది పులివెందుల అని, నేను వైఎస్‌ఆర్ అభిమానిని అని చెబుతూనే, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిందే అని అతను చెప్పారని పేర్కొన్నారు. పరిణామాల్లో జయశంకర్ న్ను ఖమ్మం తీసుకెళ్లారు.ఆమరణ దీక్షకు సిద్ధమైన కెసిఆర్‌ను ఖమ్మం జైలుకు తరలించడం, నాటకీయ పరిణామాల మధ్య అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైదంటూ కేంద్రం ప్రకటన చేసిన ఘటనలు ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. 2009, నవంబర్ 29 తెల్లారేసరికి పోలీసులు చుట్టుముట్టగా, మరోవైపు కెసిఆర్‌కు రక్షణ కవచంగా ఉద్యమశ్రేణులు నిలిచి పోలీసులను ప్రతిఘటించడంతో పోలీసులు తాత్కాలికంగా వెనక్కి తగ్గారని గుర్తు చేసుకున్నారు. పోలీసులు గందరగోళం సృష్టించి కెసిఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మంలో టిఆర్‌ఎస్ పార్టీ ఉండదు అనుకుని కెసిఆర్‌ను అక్కడికి తరలించారని, అయితే అక్కడ ఉన్న న్యూడెమాక్రసీ, పిడిఎస్‌యు శ్రేణులు ఉద్యమించాయని తెలిపారు. నన్ను మాత్రం అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. నిమ్స్‌లో కెసిఆర్ ఆమరణ దీక్ష చేస్తున్న సమయంలో అప్పటి ఐజి కెసిఆర్ చనిపోతారు…

ఉద్యమాన్ని విరమించజేయండి అంటూ తనను, తన తల్లిని, చెల్లిని బెదిరించారని గుర్తు చేసుకున్నారు. ఎవరు చెప్పినా కెసిఆర్ మొండిగా దీక్ష కొనసాగించారని, దీక్ష సమయంలో ఆయనకు చేతులు వణుకుతున్నప్పుడు తాము కూడా భయానికి లోనయ్యామని చెప్పారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్రం నుంచి ప్రకటన వస్తేనే కెసిఆర్ దీక్ష విరవిస్తారని జయశంకర్ సార్ కేంద్రంలోని పెద్దలుకు చెప్పడంతో ఆ మేరకు అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన చేశారని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News