Tuesday, January 21, 2025

ప్రపంచదిగ్గ కంపెనీల అతి పెద్ద ప్రాంగణాలు హైదరాబాద్‌లోనే….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా ఉండాలన్న ఉద్ధేశ్యంతో ఫార్మా పరిశ్రమలకు ఒకే చోట అత్యుత్తమ వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. సుల్తాన్‌పూర్ వద్ద అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. లైఫ్ సైన్స్‌తో పాటు టెక్నాలజీ రంగానికి హైదరాబాద్ అత్యుత్తమ వేదికగా మారిందన్నారు. ప్రైవేటు రంగంలో ఉపగ్రహాల తయారీ మొట్టమొదటగా హైదరాబాద్‌లోనే జరిగిందన్నారు. ప్రైవేటుగా రాకెట్ లాంచింగ్ చేసిన  స్కైరూట్ ప్రతినిధులకు కెటిఆర్ అభినందనలు తెలిపారు.

డ్రోన్‌ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే వినూత్న కార్యక్రమం చేపట్టామని కెటిఆర్ చెప్పారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో అతి పెద్ద ప్రాంగణాలు ఏర్పాటు చేసుకున్నాయని ఆయన వివరించారు. విభిన్న కంపెనీలు మాత్రమే కాదనీ, విభిన్నమైన ఆచారాలు, ఆహారం కూడా హైదరాబాద్‌లో కనిపిస్తుందన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు, ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని కెటిఆర్ తెలిపారు.

ముందుచూపుతో ఈవీ, బ్యాటరీల తయారీ రంగంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ పత్తికి దేశంలో మంచి డిమాండ్ ఏర్పడిందని, టెక్స్‌టైల్స్ రంగంలోనూ పెట్టుబడులకు విస్తృత పరిధి ఉందన్నారు. భారీ స్థాయిలో కాకతీయ టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థకు 200 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉండే పరిశ్రమలకు నీటి సమస్య కూడా లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News