Monday, December 23, 2024

సారంపెల్లి నుండే ఎన్నికల ప్రచారం చేస్తున్నా..ఆశీర్వదించండి:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి ః తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలో చేసిన అభివృద్దిని చూసి ఎన్నికల్లో మరోసారి గెలిపించి ఆశీర్వదించాలని రాష్ట్ర ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గ్రామస్థులను కోరారు.మండలంలోని సారంపెల్లి గ్రామంలో నిర్మించిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిధిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం రూ.9లక్షలతో నిర్మించిన గీత పారిశ్రామిక కమ్యూనిటి భవనాన్ని గౌడ కులస్థులతో కలిపి ప్రారంభించారు.కెసిఆర్ ప్రభుత్వం వచ్చినంక గోదావరి నీళ్లతో ఇంటింటికి మంచినీళ్లు వచ్చే విదంగా చేసుకున్నామన్నారు.కాంగ్రెస్ పాలనలో కరెంట్ గోసలు చూశామన్నారు.ఇప్పుడు 24 గంటల కరెంట్‌తో సాగునీరు,తాగునీరుకు ఇబ్బంది లేకుండా ఉన్నామన్నారు.దేశంలో ఎవరూ చేయలేని పనిని సిఎం కెసిఆర్ చేసిచూపించారన్నారు.రూ.6వేల కోట్లను విడుదల చేసి రైతు రుణమాఫీని ఏకకాలంలో రద్దు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు.

వ్యక్తిగత దూషణలకు దిగుతున్న పార్టీలకు రాబోయే రోజుల్లో గట్టి బుద్దిచెప్పాలన్నారు.ఎప్పుడు ఎన్నికలోచ్చినా సారంపెల్లి గ్రామం నుండే ప్రచారం చేస్తానని ఇప్పుడు కూడా ఇదే ప్రచారం అనుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఇప్పటి వరకు గ్రామంలో చేసిన పలు అభివృది పనుల గురించి ఆయన వివరించారు.సారంపెల్లి నుండి జిల్లెల వరకు దేశాయిపల్లె,మల్లాపూర్ మీదుగా రూ. 52.60వేలతో సిసి రోడ్డు నిర్మాణం జరిగినట్లు చెప్పారు.అలాగే అంకిరెడ్డిపల్లె వరకు రూ.2కోట్ల 59 లక్షలతో రోడ్డు,గ్రామంలో సిసి రోడ్లు,మోరీల కోసం రూ.కోటి 50లక్షలు,ముస్తాబాద్ వరకు రోడ్డు, రూ.65 లక్షలు,గ్రామ పంచాయతీ భవనం కోసం రూ.20లక్షలు,కెసిఆర్ ప్రగతి ప్రాంగణం కోసం రూ.20లక్షలు,కంపౌండ్ వాల్ కోసం రూ.8లక్షలు ,ముదిరాజ్ సంఘ భవనం కోసం రూ. 3లక్షలు, గ్రామంలో రైతులు 569 మంది ఉంటే రూ. 5కోట్ల 88లక్షలు, రైతు భీమా పది మందికి రూ.50లక్షలు, మిషన్ కాకతీయలో చెరువు కోసం రూ.36లక్షలు, వైకుంఠధామం కోసం రూ.17లక్షలు ,కంపోస్టు షెడ్ నిర్మాణం రూ.2.50లక్షలు,

ట్రాక్టర్ ట్రాలీ రూ.10లక్షలు,నర్సరీ రూ. లక్ష ,పల్లె ప్రకృతి వనం రూ.లక్ష,తెలంగాణ క్రీడాప్రాంగణం రూ.లక్షతో నిర్మించుకున్నట్లు వెల్లడించారు.ఇంకా ఎన్నో అభివృద్ది పనులు చేయాల్సి ఉందని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పవర్‌లూం టెక్స్‌టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్,జడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,ఎంపిపి పడిగెల మానసరాజు,సర్పంచ్ కొయ్యెడ రమేష్,ఎంపిటిసి గుగ్గిళ్ల లావన్య ఆంజనేయులు,బిఆర్‌ఎస్ మండల అద్యక్షులు గజభీంకార్ రాజన్న,నేరేళ్ల ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్,సిరిసిల్ల ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్,బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News