- Advertisement -
మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ చిత్ర పటానికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్ నివాసానికి వెళ్లి లింగ్యా నాయక్ కు కెటిఆర్ నివాళులర్పించి.. మంత్రి సత్యవతితోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
KTR Pays tribute to Demise of Satyavati Rathod father
- Advertisement -