Sunday, January 19, 2025

కొండా సురేఖపై కెటిఆర్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

18న సాక్షుల వాంగ్మూలం నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రి కొండా సురేఖపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో కెటిఆర్ తరఫున లాయర్ ఉమామహేశ్వర్‌రావు వాదనలు విని పిం చారు. కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 18వ తేదీన కెటిఆర్‌తో పాటు ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్న సాక్షుల స్టేట్ మెం ట్‌లను రికార్డ్ చేస్తామని వెల్లడించింది. అనంతరం కేసును 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ఈ నెల 10వ తేదీన కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. 2014-2023 వరకూ ముఖ్యమంత్రి కెసిఆర్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశానని, 5 సార్లు వరుసగా సిరిసిల్ల నియో జకవర్గానికి ఎంఎల్‌ఎగా ఉన్నానని, 9 ఏళ్లు మంత్రిగా పనిచేశానని, ప్రస్తుతం బిఆర్‌ఎస్ పార్టీకి వర్కిం గ్ ప్రెసిడెంట్‌గా ఉన్నానని కెటిఆర్ సదరు పిటిషన్‌లో పేర్కొన్నారు.

సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానని, మంత్రిగా రాష్ట్రాన్ని అభి వృద్ది చేశానన్నారు. ప్రపంచంలోని బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పనిచేశానని, తెలంగాణా వేగంగా అభివృద్ది చెందడంలో కృషి చేశానన్నారు. మంత్రి కొండా సురేఖ వాఖ్యలు తన పరువుకు తీవ్ర నష్టం చేకూర్చాయంటూ ఆమె మాట్లాడిన వీడియో, ఆడియో టేపులను, బిఎన్‌ఎస్ యాక్ట్ 356 సెక్షన్ కింద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలంటూ 23 రకాల ఆధారాలను కెటిఆర్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. అలాగే బిఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌లను తన తరపు సాక్షులుగా పేర్కొన్నారు. కాగా అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవ డానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య లు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా కెటిఆర్‌ను ఉద్దేశించి మంత్రి అనేక కామెంట్స్ కూడా చేశారు. ఈ క్రమం లో కొండా సురేఖ వ్యాఖ్యలపై కెటిఆర్ కోర్టును ఆశ్ర యించారు. కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. తనపై చేసిన వ్యా ఖ్యలు తన ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కెటిఆర్ వేసిన పిటిషన్‌పై ఈనెల 10వ తేదీన విచారణ ప్రారంభమై సోమవారం నాటికి వాయిదా పడింది. మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్య లు తీసుకోవాలని హీరో నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా కోర్టుకు నాగార్జున వ్యక్తిగతంగా హాజరయ్యారు. మ రోవైపు నాగార్జున మేన కోడలు సుప్రియ కూడా ఈ కేసులో నాగార్జున తరుపున కోర్టుకు హాజరయి సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చారు. అలాగే నాగ్ కుటుంబ సభ్యులు కూడా కోర్టులో సాక్షి వాంగ్మూలం ఇచ్చిన సంగతి విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News