Sunday, December 22, 2024

ఓటర్లందరికీ పర్సనల్‌గా కెటిఆర్ ఫోన్!?

- Advertisement -
- Advertisement -

మరోసారి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థన!!

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం కీలక ఘట్టానికి చేరింది. మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. మంగళవారం ఒక్క రోజే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మాత్రం ప్రచారం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను వంద శాతం వినియోగించుకుంటున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు పేరొందిన యూట్యూబ్ ఛానల్స్‌తో పాటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాల్లో ఇంటర్వ్యూలు, అన్ని సోషల్ మీడియాల్లో తన సందేశాలతో పాటు రేడియోల్లో టాక్‌షో ద్వారా కూడా తన ప్రచారాన్ని సాగిస్తూ దూసుకెళుతున్నారు. వీటికి తోడుగా ఒక్కో ఓటర్‌కు పర్సనల్‌గా ఫోన్ చేసి మరీ కెటిఆర్ మాట్లాడుతున్నారు. తాను పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ వాసులకు కూడా కెటిఆర్ ఫోన్లు చేస్తున్నారు.

ప్రతి ఒక్కరితో మాట్లాడే ఓపిక, తీరిక ఈ సమయంలో కెటిఆర్‌కు ఎక్కడిదీ? అని ఆలోచించాచాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరిలాగే ఆయన కూడా ఐవిఆర్‌ఎస్ కాల్ ద్వారా నేరుగా ఓటర్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ను వివరిస్తూ మరోసారి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల నియోజకవర్గ ఓటర్లతో పాటు హైదరాబాద్ ఓటర్లకు కూడా చాలా మందికి కెటిఆర్ ఫోన్ కాల్ వచ్చింది. కాగా ఇప్పటికే బిఆర్‌ఎస్ పేరుతో వాట్సప్ ద్వారా సందేశాలు పంపిస్తోన్న గులాబీ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు కూడా కెటిఆర్ ఫోన్ కాల్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌ఎ అభ్యర్థుల గొంతుతో ఓటర్లకు ఐవిఆర్‌ఎస్ కాల్స్ చేస్తుండగా,  ఇప్పుడు కెటిఆర్ కూడా చేస్తుండటం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News