Wednesday, December 25, 2024

గడ్డం ప్రసాద్ జీవితం స్ఫూర్తిదాయకం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బిఆర్‌ఎస్ పార్టీ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో కెటిఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తమకు ఆదేశిలిచ్చారన్నారు. గతంలో చేనేత మంత్రిగా సిరిసిల్లకు వచ్చి కార్మికుల సంక్షేమానికి కృషి చేశారని కొనియాడారు. ఎంపిటిసి నుంచి స్పీకర్‌గా ఎదిగిన గడ్డం జీవితం స్ఫూర్తిదాయకమని కెటిఆర్ ప్రశంసించారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు గాయాలు కావడంతో సభకు రాలేకపోయారని కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News