Monday, December 23, 2024

ఆ రెండక్షరాల కంటే కెసిఆర్ అనే మూడక్షరాలే పవర్‌ఫుల్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమ చూశారని, మాజీ సిఎం కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంపై బిఆర్‌ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. కెసిఆర్ అధికారంలో ఉండటం కంటే ప్రతిపక్షంలో ఉండటమే డేంజర్ అని హెచ్చరించారు. సిఎం అనే రెండక్షరాల కంటే కెసిఆర్ అనే మూడక్షరాలే చాలా పవర్‌ఫుల్ అన్నారు. ఫిబ్రవరిలో కెసిఆర్ ప్రజల మధ్యకు వస్తారని, ఎంపి నియోజకవర్గాల సమీక్షల తరువాత అసెంబ్లీ స్థానాల సమీక్షలు ఉంటాయని చెప్పారు. త్వరలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి 2-3 నెలలకోసారి అని కమిటీల సమావేశాలు ఉంటాయని, ఖమ్మం సీటు కచ్చితంగా గెలవాల్సిందేనని రామారావు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News