Monday, July 1, 2024

రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ విప్లవాత్మక మార్పులు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో తొలసారి రైతులు కోసం రైతుబంధు అమలు చేసిన ఘనత బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కే దక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వంలో రైతు మరణాలు తగ్గడంపై అరవింద్ వారియర్ అనే నెటిజన్ చేసిన ట్వీట్‌కు కెటిఆర్ స్పందించారు. రైతుల సంక్షేమం కోసం కెసిఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని కొనియాడారు. 70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రూపాలయు ఖాతాల్లో వేశామన్నారు. రైతు బీమా పేరుతో ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పించామని వివరించారు. 24 గంటల విద్యుత్ అందించడంతో పాటు రూ.25 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా వేల చెరువులను పునరుద్ధరణ చర్యలు చేపట్టామని, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామా లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించామని కెటిఆర్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News