Tuesday, November 5, 2024

రాముడైన, కృష్ణుడైన ఎన్టీఆరే: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఖమ్మం లకారం టాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ టిఆర్ పార్క్ ను మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. రూ.10 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, రూ.2.49 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20వ డివిజన్ ఎస్ బిఐటి ఇంజనీరింగ్ కళాశాల రోడ్ నందు మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో రూ.71 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.

రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు మాకు రాముడైన, కృష్ణుడైన నందమూరి తారక రామారావు అని తెలిపారు. తెలుగు వారంటూ ఉన్నారని, భారత దేశంలో అంటే వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని ప్రశంసించారు. చరిత్రలో మహనీయుల స్థానం అజరామనీయం అందులో ఎన్టీఆర్ స్థానం పదిలంగా పది కాలాల పాటు ఉంటుందని కెటిఆర్ వివరించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు మంత్రి పువ్వాడకు ధన్యవాదాలు తెలిపారు. తనకు తారక రామారావు అనే పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని, దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ ఎవరు కొట్టలేదని, అన్నగారు ఎన్ టి ఆర్ కూడా కొట్టలేదని, అది సిఎం కెసిఆర్ కు సాధ్యమవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు.

ఎంపిలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ విపి గౌతమ్, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఎఎంసి చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News