Friday, December 20, 2024

మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. హస్తినాపురంలో  లబ్ధిదారులకు కన్వీనియన్స్ డీడ్ పత్రాలను మంత్రి కెటిఆర్ పంపిణీ చేశారు. పలు కాలనీలకు చెందిన నాలుగు వేల మందికి ప్రొసీడింగ్స్ పత్రాలు అందజేశారు. మంత్రి కెటిఆర్ గ్రూపు2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రూపొందించిన సిడిని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.

మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని, హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని, ఆగష్టు 15 నుంచి అక్టోబరులోగా నియోజకవర్గానికి నాలుగు వేల ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. గృహ లక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షలు అందిస్తామని కెటిఆర్ వివరించారు. త్వరలో ఎల్‌బి నగర్-నాగోల్ మెట్రో లింకు పనులు ప్రారంభిస్తామని, ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ 159 కిలో మీటర్ల మెట్రో రూట్ ఏర్పాటు చేస్తామని, భూసేకరణ, తక్కువ ఖర్చుతో ఇది ఏర్పాటు చేయబోతున్నామని కెటిఆర్ స్పష్టం చేశారు. మొత్తం 314 కిలో మీటర్లు మెట్రో మార్గం అందుబాటులోకి తీసుకవస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News