- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. గోదావరి నది పరిసర ప్రాంతాలలో భారీ వరద దృష్ట్యా ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలతో మమేకమై స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రి అజయ్ ను కెటిఆర్ అభినందించారు. శుక్రవారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోని ముంపు ప్రాంతాల్లో మోకాలి లోతు నీటిలో పర్యటిస్తున్న చిత్రాన్ని ట్విట్టర్ లో కెటిఆర్ పోస్ట్ చేశారు.
- Advertisement -