Thursday, January 23, 2025

ఏ విచారణకైనా మేం సిద్ధమే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం తెలంగాణేనని కెటిఆర్ తెలిపారు. బిఆర్‌ఎస్ పాలనలో గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘స్వేదపత్రం’ పేరిట కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని, ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ చేశాశామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో తప్పు జరిగితే సరి చేయండి.. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని హామీలను నెరవేర్చేందుకు వినియోగిస్తారా..? కక్ష్య సాధింపు కోసం వినియోగిస్తారా? అది వాళ్ల విజ్ఞత అని పేర్కొన్నారు. ఏ విచారణ అయినా చేయమని తాము శాసససభలో డిమాండ్ చేసిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు.

తప్పులుంటే బయటపెట్టమనండి. అన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏరకంగా చేసిన తమకు అభ్యంతరం లేదని, ఏ ఎంక్వైరీ అయినా.. ఏ కమిషన్ అయినా.. ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా తమ అభ్యంతరం లేదని చెప్పారు. తప్పు జరిగితే చర్య తీసుకోండి అంతేగానీ, తమపై కోపంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చవద్దని కోరారు. ప్రపంచమంతా మనల్ని నిందించే పరిస్థితి తీసుకురాకండని అన్నారు. ఇప్పటికే 90 శాతం పూర్తి చేసిన పాలమూరు – రంగారెడ్డి పనులు పూర్తి చేసి నీరు ఇవ్వండి… ఫలాలు అనుభవించండి కానీ, ప్రాజెక్టులను బద్నాం చేయొద్దని అన్నారు. మారుమూల ప్రాంతాల్లోని మహిళలను అడిగితే మిషన్ భగీరథ గొప్పతనం చెబుతారని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News