Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్ పాలనలో రూ.50 లక్షల కోట్ల సంపద సృష్టి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఆకాశమంత ఎత్తులో అగ్ర రాష్ట్రంగా ఉందని, రాష్ట్రానికి అస్థిత్వమే కాదు.. ఆస్తులు కూడా సృష్టించామని కెటిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్ పాలనలో గత తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరిస్తూ తెలంగాణ భవన్‌లో ఆదివారం ‘స్వేదపత్రం’ పేరిట కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో సుమారు రూ.50 లక్షల కోట్లపైనే సంపద సృష్టించామన్నారు. పెట్టిన ఖర్చు కన్నా పదుల రెట్లు ఎక్కువ ఆస్తులు, సంపద సృష్టించామని చెప్పారు. “అప్పు కాదు..ఖర్చు కాదు..ఇది పెట్టుబడి.. సంపద సృష్టి.. రాష్ట్ర సంపద” అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. “తెలంగాణ దేశానికే దీపస్తంభం…ఆరిపోనివ్వం…ఆగిపోనివ్వం..ప్రజల పక్షాన నిలబడతాం” అంటూ ఉద్ఘాటించారు.

సాగునీరు, గ్రామాల అభివృద్ధి వల్ల భూముల విలువ భారీగా పెరిగిందని చెప్పారు. కోటి 52 లక్షల ఎకరాల పట్టా భూమి విలువ కనీసం ఐదు రెట్లు పెరిగిందని తెలిపారు. 60 ఏళ్లలో రూ.4,98,053 కోట్లు ఖర్చు చేశారన్నది శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని ఆరోపించారు. తెలంగాణలో గత పదేళ్ల ఖర్చు రూ.13,72,930 కోట్లు అని, విద్యుత్ రంగంలో తమ ప్రభుత్వం సృష్టించిన ఆస్తులు రూ.6,87,585 కోట్లు అని వెల్లడించారు. విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని 7,778 మెగావాట్ల నుంచి 19,464 మెగావాట్లకు పెంచామని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News