Sunday, April 6, 2025

హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారే: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరూ మా వారేనని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శనివారం కెటిఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు తెలంగాణ బిడ్డపై దాడి చేస్తవా.. మా సత్తా ఏంటో చూపిస్తామని అరికెపూడి గాంధీపై కౌశిక్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. హైదరాబాద్‌ ప్రజలు బిఆర్ఎస్ కు అండగా నిలిచారన్నారు. ఇక్కడున్న ప్రజలందరూ మా వారేనని..అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష కట్టారని కెటిఆర్ ఆరోపించారు. ప్రాంతీయతత్వంపై దాడులు గతంలోనూ లేవు.. ఇప్పుడూ ఉండవని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News