Thursday, December 26, 2024

పదవులు ఊడడం ఖాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్‌కు, మంత్రి పొంగులేటికి ఉద్వాసన
తప్పదు బావమరిదికి అమృతం.. ప్రజలకు విషం పంచుతున్న రేవంత్
అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై కేంద్రమంత్రికి ఆధారాలు సమర్పించా
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి పదవులు పోవడం ఖాయం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగం చేసిన సోని యాగాంధీ, అశోక్ చవాన్ సహా చాలామంది పదవులు కోల్పోయారని ఉదహరించారు. అమృత్ పథ కం అవినీతిపై కేం ద్ర పట్టణాభివృద్ధి శాఖ మనోహ ర్ లాల్ కట్టర్‌ను కలిసిన కెటిఆర్.. ముఖ్యమంత్రి గాఅధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న రేవం త్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బిఆర్‌ఎస్ ఎంపీలు కెఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, మాజీ ఎంపీలు బాల్క సు మన్, బడుగుల లింగయ్య యాదవ్ ఇ తర నేతలతో కలిసి మంగళవారం ఢిల్లీలో కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం అవినీతి,కుంభకోణాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్ర ప్ర భుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని, వాటికి కేంద్ర మంత్రికి అందజేశామని వెల్లడించారు. సిఎంగా ఉండి రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. అర్హత లేకపోయినా శోధా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని, రూ.1,137 కోట్లకు సంబంధించిన పనులు ఆ కంపెనీకి ఇచ్చారని పేర్కొన్నారు.

2021-22లో శోధా కన్స్ట్రక్షన్ నికర ఆదాయం రూ.2.2 కోట్లు మాత్రమేనని, అలాంటి కంపెనీకి రూ.800 కోట్ల టెండర్లు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టెండర్లు రద్దు చేయాలని కేంద్రమంత్రిని కోరామని చెప్పారు. రాహుల్ గాంధీ క్రోనీ క్యాపటలిజం, అవినీతి గురించి మాట్లాడుతున్నారని.. కొందరు పారిశ్రామికవేత్తలు అధికారవర్గానికి దగ్గరగా ఉండి లక్షల కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తప్పులు జరుగుతున్నాయని ఆధారాలు తీసుకొచ్చి కేంద్రానికి అందజేశామని, అయినా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమృత్ పథకం టెండర్లకు సంబంధించి వెబ్‌సైట్‌లో వివరాలు లేవని, కేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

మేము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకు..?
రేవంత్ తన బావమరిదికి అమృతం పంచి.. కొడంగల్ ఫార్మాతో ప్రజలకు విషం ఇస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. అల్లుడి కోసం కొడంగల్‌ను బలిపెట్టే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అందుకే కొడంగల్‌లో తిరుగుబాటు మొదలైందన్నారు. రుణమాఫీ, రైతుబంధుకు డబ్బులు లేవంటున్నారని, కానీ మహారాష్ట్రలో తెలంగాణ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చారని విమర్శించారు. పొగులేటి కంపెనీకి రూ.4,300 కోట్ల పనులు అప్పగించారని చెప్పారు. తాము ఢిల్లీకి వస్తే కాంగ్రెస్ నేతలకు భయం ఎందుకని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా తాము ఢిల్లీకి వస్తామని, దేశ ప్రజల దృష్టికి ప్రభుత్వ మోసాలను తీసుకొస్తామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి 26 సార్లు ఢిల్లీకి తిరిగినా 26 పైసలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. మరి బిఆర్‌ఎస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం కచ్చితంగా ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై ఎప్పటికప్పుడు ఢిల్లీకి వచ్చి ఎండగడతామని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు డబ్బు వెళ్తున్నదని కెటిఆర్ ఆరోపించారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మరిన్ని చెక్ పోస్టులు పెట్టాలని అన్నారు. తెలంగాణలో వసూళ్లు, బెదిరింపులు పెరిగాయని కెటిఆర్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News