Wednesday, January 22, 2025

ముందస్తుకు మేం రెఢీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: దమ్ముంటే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు రండి.. అందుకు మేం కూ డా రెడీ.. లోక్‌సభను రద్దు చేసి వస్తే.. ఎన్నికలకు వెళ్లి ఎవరి బలమేంటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం అని రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కల్వ కుంట్ల తారక రామారావు బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. శనివారం నిజామాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేంద్రం మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని, దుర్మా ర్గపు అసమర్థ ప్రభుత్వంగా ముద్ర వేసుకుందన్నారు. మాటలేమో సబ్ కా వికాస్.. చేతలోమో సబ్‌కుచ్ బక్‌వాస్ తీరిన మోడీ పాలన సా గుతోందన్నారు.

తెలంగాణలో అభి వృద్ధి, సంక్షేమంతో కూడిన జనరంజక పాలన సాగుతూ.. దేశానికే రోల్ మోడల్‌గా మారింద న్నారు. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలం గాణ పట్ల వివ క్ష చూపుతోందని, మోడీ ప్రభుత్వం నయాపైసా తెలం గాణకు ఇవ్వలేదని, కనీసం ఓ విద్యా సంస్థ కూడా ఇచ్చిన పాపానపోలేద న్నారు. పన్నుల రూపంలో తెలంగాణ కేంద్రానికి చెల్లిస్తున్న దాం ట్లో కనీసం 40శాతం కూడా తిరిగి ఇవ్వలేకపోతోందని కెటిఆర్ దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి వెలుతున్న నిధులను బిజెపి పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు ఇస్త్తుంటే గల్లీ లీడర్లు మాత్రం అనవసర లొల్లి చేస్తున్నారని, కెసిఆర్ అప్పులు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్న బిజెపి నాయకులు మోడీ చేస్తున్న అప్పుల గురించి ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. స్వాతంత్ర భారతంలో 14మంది ప్రధానులు 56లక్షల కోట్లు అప్పులు చేస్తే మోడీ ఒక్కడే రూ.100 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డులు సృష్టించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఉత్పాదకరంగాలను మరింతవృద్ధిలోకి తేవడానికే వినియోగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

బిజెపి నేతలు మోడీని దేవుడని ఎందుకంటున్నారని, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మొండికేస్తున్నందుకా, చేనేత వస్త్రాలపై జిఎస్‌టి వేసి.. ఆ పరిశ్రమను నాశనం చేస్తున్నందుకా, రైతులను ఉసురుపోసుకున్నందుకు దేవుడంటున్నారా అని బిజెపి నేతలను ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును గాలికివదిలేసి హిందూస్తాన్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం అంటూ పంచాయితీలు పెడుతోందని మండిపపడ్డారు. దేశం మొత్తంగా రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే కేవలం రూ.1.40లక్షల కోట్లు అవసరమవుతాయని అయన అన్నారు.

కానీ, బ్యాంకు రుణాలు ఎగ్గొటిన బడాబాబులకు ఎన్ని లక్షల కోట్లు మాఫీ చేశారో బిజెపి నేతలు చెప్పాలన్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధును కేంద్రం దేశవ్యాప్తంగా అమలుచేయాలని ఆయన కెటిఆర్ డిమాండ్ చేశారు. ఎకరా పంటకు రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు దఫాలుగా రైతులకు రైతు సాయం ఇవ్వాలని, తద్వారా మోడీ సర్కార్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. అంతేగాని ఉచిత పథకాల మీద అనవసరంగా ప్రగల్బాలు పలకవవద్దన్నారు.

నిజామాబాద్ నగరానికి వివిధ అభివృద్ధి పనుల కోసం సిఎం కెసిఆర్ ఇప్పటిదాకా రూ.936 కోట్లు వెచ్చించారని, మరో రూ.100కోట్లు ప్రకటించారని మంత్రి కెటిఆర్ తెలిపారు. కానీ, నిజామాబాద్ ఎంపి అర్వింద్ ఈ నాలుగేళ్ల కాలంలో ఒక్క రూపాయన్నా తెచ్చాడా అని ప్రశ్నించారు. పసుపు బోర్డు తెస్తానని రైతులకు హామీ ఇచ్చిన ఎంపి.. ఉన్న జూట్ బోర్డును ఎత్తేసినా నోరు ఎందుకు మెదపడంలేదన్నారు. ఎంపి సభ్యతా, సంస్కారంతో మాట్లాడాలని.. ఆయన తండ్రి డి శ్రీనివాస్ పెద్దాయన అనే గౌరవంతో తాము గౌరవమిస్తున్నామన్నారు.

చిల్లర మాటలు పక్కనబెట్టి అభివృద్ధిలో తమతో పోటీపడాలని కెటిఆర్ సవాల్ చేశారు. తాము చెప్పే గణాంకాలు తప్పయితే రాజీనామా చేస్తామన్నారు. చిత్త శుద్ది ఉంటే వచ్చే బడ్జెట్‌లో తెలంగాణాకు నిధులు తీసుకురావాలని, ఆయా విద్యాసంస్థలు మంజూరు చేయించాలని కోరారు. సమావేశంంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపి కెఆర్ సురేష్‌రెడ్డి, ఎంఎల్‌ఏలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, షకీల్, ఎంఎల్‌సి డి.రాజేశ్వర్, బిజిగౌడ్, మాజీ ఎంఎల్‌సి ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News