Monday, December 23, 2024

కెసిఆర్ మళ్లీ గెలిస్తే.. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కెసిఆర్ ను మళ్లీ గెలిపిస్తే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం మంత్రి కెటిఆర్ సమక్షంలో పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు సత్యనారాయణరెడ్డి, రామూర్తిలు తమ కార్యకర్తలతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ను ప్రజలు తమ ఇంటి పార్టీగా భావిస్తారన్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్పారు. విద్యుత్ సమస్య, నీళ్ల సమస్య పరిష్కరించుకున్నామని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లా అంతా పచ్చగా మారిందని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుందని చెప్పారు. కెసిఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమం అమలు చేస్తామని.. కెసిఆర్ మళ్లీ గెలిస్తే… ఏం చేస్తామో కెసిఆర్ భరోసాలో చెప్తున్నామన్నారు. ఇందులో అర్హులైన మహిళలకు భృతిగా నెలకు రూ.3వేలు.. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.

ఒకప్పుడు విద్యుత్ అధికారులు రైతుల మోటర్లకు తీగలు కట్ చేసి తీసుకెళ్లేవారని.. ఇప్పుడు ఆ పరిస్థతి లేదన్నారు. ఒక్క అవకాశం ఇవ్వమంటున్న కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని.. కర్నాటకలో కరెంటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రజలు అప్పుడే బాధపడుతున్నారని.. 24 గంటల కరెంట్ కావాలా?.. 3 గంటల కరెంట్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు.

Also Read: రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కిషన్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News