Monday, December 23, 2024

తెలంగాణ పబ్లిక్ కమిషన్ దేశంలోనే అత్యుత్తమమైనది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ కమిషన్(టిఎస్ పిఎస్సి) దేశంలోనే అత్యుత్తమమైనదని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.టిఎస్ పిఎస్సిపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం నిర్వహించిన అనంతరం బిఆర్ కె భవన్ లో మంత్రి కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ”టిఎస్ పిఎస్సి పేపర్ లీకేజీపై సిఎం కెసిఆర్ తో సమీక్షించాం. గత ఎనిమిదేళ్లలో దేశంలో అత్యధిక ఉద్యోగాలను భర్తి చేయడంతోపాటు ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత టిఎస్ పిఎస్సిది. తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటివరకు 155 నోటిఫికేషన్లు టిఎస్ పిఎస్సి ఇచ్చింది. ఏకకాలంలో 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత టిఎస్ పిఎస్సిది.

గతంలో ఉమ్మడి ఎపిపిఎస్సిపై ఆరోపణలు వచ్చేవి. కానీ, ఇవాళ్టివరకు టిఎస్ పిఎస్సిపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఏకంగా ఇంటర్వ్యూల ప్రక్రియనే టిఎస్ పిఎస్సి రద్దు చేసింది. కాలానుగుణంగా సాంకేతికతను జోడించి టిఎస్ పిఎస్సి పురోగమిస్తోంది. కమిషన్ లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు..వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చింది. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితోపాటు ఎంతమంది ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదు.. ఇద్దరు చేసిన తప్పు మాత్రమే” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News