Monday, December 23, 2024

వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Press Meet on Rythu Bandhu

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహా సంకల్పానికి శిరస్సు వహించి నమస్కరిస్తున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటి రామారావు అన్నారు. సోమవారం ఉదయం తెలంగాణ భవన్ మంత్రి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”ఈ రోజు తెలంగాణ చరిత్రలొనే కాదు స్వాతంత్ర భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.65 లక్షల రైతుల కుటుంబాలు, 60 లక్షల టీఆర్ఎస్ కార్యకర్తల తరపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు. రైతు బంధు ద్వారా 50 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం మామూలు విషయం కాదు ఒక సాహసం. రంతుబంధు సిఎం కెసిఆర్ మానస పుత్రిక. కరోనా నిబంధనలను పాటిస్తూ అన్ని వర్గాలు కేసీఆర్ పట్ల కృతజ్ఞతలు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సంబరాలను సంక్రాంతి దాకా పొడిగిస్తున్నాం. రైతులకు ఇంత మేలు జరుగుతుంటే కొందరు పొలిటికల్ టూరిస్ట్ లు రాష్ట్రానికి వచ్చి ఎదో మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలే. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఎంత మారిందో తెలంగాణ ప్రజలు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించాలి. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు ట్రైనీ ఐఎస్ లకు పాఠ్యంశాలుగా మారాయి. కోటి ఎకరాల మాగాణే కాదు..ముక్కోటి టన్నుల ధాన్యగారంగా తెలంగాణ మారింది. వ్యవసాయానికి కేసీఆర్ ఇచ్చిన ఊతమే రైతు జీవితాలను మార్చింది. వేరే రాష్ట్రాలు కూడా రైతు బంధును అనుసరిస్తున్నాయి. రూ.50వేల కోట్ల ముల్లె ప్రతి పల్లె చేరింది. నాలుగు లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశాము. మిగతాది దశల వారీగా చేస్తాం. రైతు బీమా రైతుకు రక్షణ కవచంగా మారింది. రైతు బీమాతో కేసీఆర్ రైతులకు అన్నగా మారారు. రైతు బీమాకు 3205 కోట్ల మేర ప్రీమియం కట్టాం.70 వేల మంది రైతులకు రైతు బీమాతో ప్రయోజనం జరిగింది.ఇలాంటి పథకం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా. కేంద్రం నుంచి అరపైసా సాయం లేకున్నా కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. జాతీయ పార్టీ లకు మమ్మల్ని విమర్శించే మొహం ఉందా. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్ కు రెండు కండ్లు. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ కు వరప్రదాయిని అయితే.. కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు ఊపిరి. పాలమూరు కొందరు దుర్మార్గుల కోర్టు కేసులతో కొంత ఆలస్యంవుతోంది అయినా పూర్తి చేస్తాం. పాలమూరు బీడు భూములకు ఖిల్లాగా ఉండేది. ఇపుడు చేపల చెరువులకు అడ్డాగా మారింది. కేసీఆర్ వ్యవసాయానికి దిక్సూచిగా మారారు” అని పేర్కొన్నారు.

KTR Press Meet on Rythu Bandhu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News