ఇందల్వాయి : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం పోతంగల్ గ్రామానికి చెందిన గోసంగి నవీన్ కూలి నాలి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు గత మూడు రోజుల క్రితం అప్పుల బాధతో ఉరివేసుకొని చనిపోయాడు. మూడేళ్ల క్రితం అతని భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. దీంతో ఆ దంపతుల సంతానం ముగ్గురు ఆడ పిల్లలు చిన్నారులు ఆనాధలు అయ్యారు.
ఈ కథనం విన్న ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ మౌల అలియాస్ అజీముద్దిన్ ఈ చిన్నారుల వార్తను కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచనతో ఎస్‌కె మౌలా ఈ వార్తను కెటిఆర్‌కు ట్విట్టర్ ద్వారా ట్యాగ్ చేయడంతో కెటిఆర్ వెంటనే స్పందించి జిల్లా కలెక్టరుకు మరియు ఉన్నత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయడంతో వారిని వెంటనే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదే అని ఆయన స్పందించారు. ఈ కథనం విన్నగ గ్రామస్తులు చిన్నారులకు ఒక తండ్రి లాంటి కెటిఆర్ పిల్లల బాధ్యతలు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వార్తను తన దృష్టికి తెచ్చిన షేక్ మౌలా అలియాస్ అజీముద్దిన్‌కి కృతజ్ఞతలు ట్విట్టర్ ద్వారా తెలుపడంతో ఇందల్వాయి మండలం కేంద్రంలో ఆయన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు స్థానికులు ధన్యవాదాలు తెలుపుతూ సంతోషించారు.