Wednesday, January 22, 2025

ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారికి అండగా ఉంటానని కెటిఆర్ భరోసా ఇచ్చారు. ఇటీవల నగరంలో ఆత్మహత్యకు పాల్పడ్డ వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు బుధవారం మంత్రి కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక తల్లిదండ్రులు మంత్రి కెటిఆర్‌తో తమ ఆవేదన పంచుకున్నారు. ప్రవళిక మరణానికి శివరామ్ అనే వ్యక్తి కారణం అని, అతన్ని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబసభ్యులు కెటిఆర్‌ను కోరారు. తమ కూతురు మృతికి కారణమైన శివరాంకి కఠిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కెటిఆర్ ప్రవళిక కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,

ప్రవళిక మరణం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ బాధాకర సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ సంఘటనకు సంభందించి మంత్రి కెటిఆర్ డిజిపితో మాట్లాడి అన్ని వివరాలు అడిగి తెలుసుకుని, విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు. ప్రవళిక మృతికి కారణమైన వ్యక్తికి తప్పకుండా తగిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. మంత్రి కెటిఆర్ ఇచ్చిన భరోసాకు ప్రవళిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News