Saturday, January 4, 2025

తీర్పు ఇచ్చేవరకు కెటిఆర్ అరెస్టు వద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో:ఫార్ములా- ఈ రేసుపై ఎసిబి నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కెటిఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు మంగళవారం రిజర్వు చేసింది. కోర్టులో ఇరువైపులా వా దనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై తీర్పును రిజ ర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తీర్పు వెల్లడించేవర కు కెటిఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కెటిఆర్‌పై ఈరేస్ కేసులో కేసు నమోదు చేయడంతో కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే ఎసిబి కౌంటర్ దాఖలు చేసింది. పిటిషన్‌లో కేసుకు సం బంధించి పలు అంశాలు పేర్కొన్న ఎసిబి, నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు తెలిపింది. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు పేర్కొంది. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కెటిఆర్‌పై కేసు నమోదు చేశామనని ఎసిబి తెలిపింది. ఫార్ములా -ఈ ఆపరేషన్స్ సంస్థను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారా అని అడిగిన హైకోర్టు, ఇందులో ఎవరెవరి మధ్య ఒప్పందం జ రిగిందని ప్రశ్నించింది. విదేశీ సంస్థకు పౌండ్ల రూ పంలో రూ.46 కోట్లను చెల్లించారని, ఇందులో ఆర్‌బిఐ నిబంధనలను పాటించలేదని ఎసిబి ఆరోపించింది.

హెచ్‌ఎండిఎ నుంచి రూ.10 కోట్లకు మించి చెల్లిస్తే ఆర్థికశాఖ అనుమతి ఉండాలన్న ఎసిబి, ఎవరి అనుమతి లేకుండానే రూ. 54 కోట్లు చెల్లించారని కౌంటర్‌లో పేర్కొంది. కెటిఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఎసిబి అధికారులు నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌కు వర్తించవని వాదించారు. ఫార్ములా -ఈ కార్ల రేసు నిర్వహణ ఒప్పందంపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని తెలిపారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కెటిఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చడం తగదని వాదించారు. కెటిఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని వాదించిన సీనియర్ లాయర్ సిద్దార్థ్ దవే, అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదని తెలిపారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని కోరారు. భోజన విరామం తర్వాత ఎజి, గతంలో జిహెచ్‌ఎంసి కమిషనర్‌గా ఉన్న దానకిషోర్ లాయర్ కోర్టుకు వాదనలు వినిపించారు. ఎసిబి తరఫున వాదనలు వినిపించిన ఎజి ఎ.సుదర్శన్‌రెడ్డి, ఈ-కార్ల రేసింగ్ సీజన్-10 ఒప్పందానికి ముందే చెల్లింపులు చేశారని తెలిపారు. రూ.46 కోట్లను బ్రిటన్ పౌండ్ల రూపంలో చెల్లించారని వివరించారు.

ఈ క్రమంలో దర్యాప్తు ఏ దశలో ఉందని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్మూలం సేకరించినట్లు ఎజి తెలిపారు. నిందితులు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా ? ఈ కేసులో నిందితులుగా ఉన్న అర్వింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. నిందితులు పిటిషన్లు దాఖలు చేయలేదని చెప్పిన అడ్వకేట్ జనరల్, కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదని కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఎజి తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని వివరించారు. దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్‌రెడ్డి హైకోర్టుకు వాదనలు వినిపించారు. మంత్రి పర్యవేక్షణలోనే పురపాలకశాఖ అధికారులు విధులు నిర్వహిస్తారని, రేసింగ్‌కు చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి మంత్రి కెటిఆర్ ఆమోదించారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. రేసింగ్ అంశంలో అన్నిరకాలుగా నిబంధనలు ఉల్లంఘించారని వివరించారు. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు కెటిఆర్ క్వాష్ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చేవరకు కెటిఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News