- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ వ్యవహారశైలిపై రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తప్పుబట్టారు. ఆత్మనిర్భర్ భారత్ అంటూ స్వదేశీ వస్తువులపైనే ఆయన ట్యాక్స్‌లు వేయటంపై మండిపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్‌కు సూచికగా మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడానికి చరాఖాను ఉపయోగించారని గుర్తు చేశారు. కానీ ప్రధాని మోడీనేమో భారత్‌కు ఎంతో ప్రత్యేకమైన ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జిఎస్‌టి విధించారన్నారు. ఖాదీ, హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై జిఎస్‌టి విధించిన మొదటి ప్రధానిగా గుర్తింపు పొందారన్నారు. ఇదేనా మీ ఆత్మనిర్భర్ భారత్..? మీరు చెప్పే వోకల్ 4 లోకల్ ఇదేనా? అని కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
KTR question PM Modi on Atmanirbhar Bharat
- Advertisement -