Monday, December 23, 2024

తమిళనాడుకు 11 వైద్య విద్యాలయాలు.. మాకేవీ మోడీ: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణను విస్మరిస్తున్న కేంద్రం
మోడీపై కెటిఆర్ ధ్వజం
మాకేవీ విద్యాలయాలు? అని సూటి ప్రశ్న

మన తెలంగాణ/హైదరాబాద్: తమిళనాడులో ఒకే రోజు 11 వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కెటిఆర్ స్పందించారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువత, విద్యార్థుల తరపున అడుగుతున్నాను.. తెలంగాణకు విద్యాలయాలు కేటాయించి, తప్పును సరిదిద్దుకోవాలని మోడీకి కేటిఆర్ సూచించారు. తెలంగాణకు విద్యా సంస్థలు కేటాయించాలని అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్క విద్యాలయాన్ని కూడా ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేయలేదు అని కెటిఆర్ గుర్తు చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు విద్యాలయాలు, వైద్య కళాశాలలను మంజూరు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిందని కెటిఆర్ ఆక్షేపించారు. గిరిజన విశ్వవిద్యాలయం రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నా మంజూరు చేయలేదన్నారు. ఏడు సంవత్సరాల్లో కేంద్రం ఇతర రాష్ట్రాలకు మంజూరు చేసిన విద్యాసంస్థల వివరాలను మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News