Wednesday, January 22, 2025

మోడీ.. మౌనమేల?

- Advertisement -
- Advertisement -

శ్రీలంక విద్యుత్ బోర్డు చైర్మన్ ఆరోపణలపై స్పందించరేమి?
అదానీ నోటా మాట రావడం లేదెందుకు? ఇది దేశ ప్రతిష్టను మంటగలిపే వ్యవహారం కాదా?
అగ్నిపథ్‌తో నిరుద్యోగుల గుండెల్లో మంటలు ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీపై వరుస ట్వీట్లతో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పదునైన విమర్శలతో ధ్వజమెత్తుతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఘాటు ప్రశ్నలతో కడిగిపారేస్తున్నారు. కమలనాథులను కంగారు పెట్టిస్తున్నారు. ప్రధానంగా ఎనిమిది సంవత్సరాల్లో అనేక రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తే ప్ర గతి మోడీ పాలనలో ఎందుకు కనిపించడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రాన్ని తనదైన శైలిలో కెటిఆర్ నిలదీస్తున్నారు.రెండు రోజుల క్రితం ఉద్యోగాల భర్తీపై కేంద్రం చేసిన ప్రకటనను మరో జుమ్లాగా పేర్కొన్న మంత్రి కెటిఆర్ తాజాగా గురువారం మోడీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదానీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ, ఆదానీలను విమర్శిస్తూ ప్రముఖ యాక్టివిస్టు ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్‌ను కెటిఆర్ రీట్వీట్ చేస్తూ పరోక్షంగా మరోసారి విమర్శించారు.

ప్రధానంగా శ్రీలంకలో పవన విద్యుత్ కాంట్రాక్టులు ఆదానీకి ఇవ్వాలని శ్రీలంక ప్రభుత్వంపై మోడీ ఒత్తిడి తెస్తున్నారని ఆ దేశానికి (శ్రీలంక) చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఎంఎంసి ఫెర్డినాండో చేసిన ఆరోపణలపై ప్రధాని, ఆదానీలెవరూ స్పందించరని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా శ్రీలంక పో ర్ట్ అథారిటీ సూపర్ వైజర్ కలుతరాగే మాట్లాడిన ఓ వీడియోను కూడా కెటిఆర్ రీట్వీట్ చేశారు. ఈ విషయంపై జాతీయ మీడియా కూడా నిశ్శబ్దం వహిస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంలో ఆదానీ సంస్థకు లబ్ధిచేకూర్చేలా కేంద్రం వ్యవహరించిందని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుంటే మోడీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ట్విట్టర్ వేదిక ద్వారా మంత్రి కెటిఆర్ నిలదీశారు. ఈ ఆరోపణలపై స్పందించడానికి మోడీకి నోరు రావడం లేదా? లేక తీరిక లేకుండా ఉన్నారా? అ ని ప్రశ్నించారు. దీనిపై ఆదానీ కూడా స్పందించకపోవడం శోచనీయమని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. ఇది దేశ ప్రతిష్టను మంటగలిపే వ్యవహారం కాదా? అని కెటిఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో మోడీ, ఆదానీలు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే బాధ్యత వారిపై లేదా? అని ట్విట్టక్ వేదిక ద్వారా మండిపడ్డారు. ఈ అం శాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తే సిబిఐ, ఇడి, ఐటి ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేం ద్రం టార్గెట్ చేయడం సాధారణంగా మారిందని కెటిఆర్ పేర్కొన్నారు. కాగా ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై కెటిఆర్ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.
ఏడాదికి 1.5 లక్షల ఉద్యోగాలా?
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నుంచి ఏడాదికి 1.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే స్థాయికి వచ్చారని విమర్శలు చేశారు. తాజాగా మోడీ ప్రభుత్వం ఆర్మీలో అగ్నిపథ్ పేరుతో ఒక స్కామ్‌ను ప్రకటించిందని విమర్శించారు. ఇందు లో సైన్యంలోకి రిక్రూట్ చేసుకొనే సైనికులు నాలుగేళ్లకే రిటైర్ అవుతారన్నారు. దీనిపై ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఆందోళనలు సాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభు త్వం పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టే విధానానికి స్వస్తి పలికితే మంచిదన్నారు. నిరుద్యోగుల జీవితాలకు చెలగాటమాడకుండా ఉన్న పదవులను భర్తీ చేయాలని సూచించారు.

KTR question to PM Modi over Sri Lanka Power board Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News