Sunday, December 22, 2024

రాష్ట్రాన్ని బుల్డోజర్ రాజ్ కానివ్వొద్దు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కానివ్వద్దని, ఈ మేరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే కు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ‘ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయలుగా మార్చటం అమానవీయం, అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ వారిని నిరాశ్రయులు చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ‘ అంటూ మల్లిఖార్జున ఖర్గే ను కేటీఆర్ ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్ పట్టణంలోని 75 మంది పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసిన సంఘటనను ఆయన దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు. మీ ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని అని ఆయనకు చెప్పారు. ఎలాంటి చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించటమనేది చట్టపరంగా కరెక్ట్ కాదనీ, ఆధునిక సమాజంలో ఇలాంటి ఆటవిక వ్యవహారాలు ఏమాత్రం మంచివి కావన్నారు. 40 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇళ్లు కట్టుకొని నివాసం ఉన్న పేదల ఇళ్లును ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చేస్తుండటం ఎంత అవమానవీయామో ఖర్గే చెప్పాలన్నారు. తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కాకుండా మీ పార్టీ ప్రభుత్వానికి సూచన చేయలంటూ ఖర్గే కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News