Tuesday, December 24, 2024

గుజరాత్‌లో డేటా ఎంబసీలు భద్రతకు ముప్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం డాటా ఎంబసీలను కేవలం గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. దేశానికి అత్యంత కీలకమైన ఈ విషయంలో మొత్తం డేటా ఎంబసీలను కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేక స మస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రా శారు. ఈ లేఖలో డేటా ఎంబసీలను ఒక దగ్గర ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను సవివరంగా తె లియజేశారు. ప్రభుత్వం డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలన్నకుంటున్న గుజరాత్ గిఫ్ట్ సిటీ, భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న భౌగోళిక ప్రాంతమన్నారు.దీంతో పాటు దేశ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రంలో డే టా ఎంబసీలను ఏర్పాటు చేయడం అ త్యంత రిస్క్‌తో కూడుకున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ నగరానికి భౌగోళికంగా ప్రకృతి వైపరీత్యాలు నుంచి సహజంగా వస్తున్న రక్షణ, అనుకూలతలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో డేటా ఎంబసీ సెంటర్లను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. డేటా ఎంబసీల ఏర్పాటు విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని కెటిఆర్ కోరారు. భారత దేశంలోనే అత్యంత సురక్షితమైన సెస్మిక్ జోన్…-2లో హైదరాబాద్ నగరం ఉన్నదని అందుకే హైదరాబాద్ నగరంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం అత్యుత్తమమైన నిర్ణయం అవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న, గిఫ్ట్‌సిటి సెస్మిక్ జోన్… 3, సెస్మిక్ జోన్…-4కు అత్యంత దగ్గరగా ఉన్న ప్రాంతమన్నారు. తద్వారా ఇక్కడ భూకంపాలు భారీగా వచ్చే అవకాశం ఉన్నదన్నారు. పొరపొటున ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొత్తం డేటా ఎంబసీల కార్యకలాపాలు స్తంభించి, దాని ప్రభావం అంతర్జాతీయ సంబంధాలపై ఉంటుందన్నారు.
అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్..
ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు భారతదేశంలో తమ డేటా సెంటర్లను ఏర్పాటుకు ముందు విస్తృతమైన అధ్యయనాలను చేసి, తెలంగాణను తమ డేటా సెంటర్లకు కేంద్రంగా ఎంచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ తన లేఖలో ప్రస్తావించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుంచి మొదలుకొని మైక్రోసాఫ్ట్ వరకు అనేక కంపెనీలు హైపర్ స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటు తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. 2016 లోనే తెలంగాణ ప్రభుత్వం తమ డేటా సెంటర్ పాలసీని ప్రకటించిందని, ఇందులో భాగంగా డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాల విషయంలో తెలంగాణ రాష్ట్ర డేటా సెంటర్ పాలసీ అత్యంత ఆకర్షణీయంగా ఉందన్నారు. డ్యూయల్ పవర్ గ్రిడ్ సౌకర్యంతో పాటు అత్యంత తక్కువ ధరకే విద్యుత్ సరఫరా, హైస్పీడ్ ఫైబర్ నెట్‌వర్క్ వంటి అనేక అనుకూలతలు తెలంగాణకు ఉన్నాయని తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసిన కంపెనీలు తమ కార్యకలాపాల పట్ల, ఇక్కడి పెట్టుబడుల అనుకూల వాతావరణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా కెటిఆర్ తన లేఖలో నిర్మల సీతారామన్ కు వివరించారు. ఇప్పటికే అనేక డేటా సెంటర్ లను ఏర్పాటు చేసిన కంపెనీలకు అందించిన పూర్తి సహాయ సహకారాలను ఇంటర్నేషనల్ డేటా ఎంబసీస్ ఏర్పాటుకు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. డేటా ఎంబసీలను కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునర్ పరిశీలించి, ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన డేటా ఎంబసీస్ ఏర్పాటును దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేసే విధంగా పునర్నిర్వచించాలని కెటిఆర్ కోరారు. తద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం ఈ విషయంలో సమాన అవకాశాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News