Thursday, January 23, 2025

మంత్రిగా కాదు.. మనవడిగా వచ్చా

- Advertisement -
- Advertisement -

బోయినిపల్లివాసులతో
మంత్రి కెటిఆర్ మాటా మంతి

మన తెలంగాణ/బోయినిపల్లి: నేను కొదురుపాకకు మంత్రిగా రాలేదు.. మనుమడిగా వ చ్చాను..ఈ గ్రామం మా అమ్మమ్మ, తాతయ్యలది. అందుకే ఈ గ్రామంపై నాకు అభిమా నం.. చిన్నప్పుడు మా తాతమ్మ ఇక్కడకు నన్ను తీసుకుని వచ్చేవారు.. తర్వాతర్వాత చదువు.. ఉద్యోగం రీత్యా అంతా కరీంనగర్, హైదరాబాద్, అమెరికాలో గడపడం వల్ల అప్పట్లో ఇక్కడికి రావడం వీలు కాలేదన్నారు. అయినప్పటికీ తన తాతగారి ఊరంటే  తనకెంతో అభిమానమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో తన అమ్మమ్మ- తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం రూ.2కోట్లతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి మంగళవారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు.

నేను కొదురుపాకకు మంత్రిగా రాలేదు.. మనుమడిగా వచ్చాను. హైదరాబాద్, కరీంనగర్‌లో విద్యాభ్యాసం చేసేటప్పుడు మా తాతయ్య కొదురుపాకకు తీసుకువచ్చేవాడు. మా తాతయ్య చివరి చూపుకు కూడా నేను నోచుకోలేదు. అమెరికాలో ఉన్నప్పుడు తాతయ్య చనిపోయారు.. నేను ఏడాది తర్వాత వచ్చిన. అప్పుడుగానీ నాకు ఆ విషయం తెలియలేదు.అమ్మమ్మ-, తాతయ్య జోగినిపల్లి కేశవరావు-లక్ష్మీబాయి స్మారకార్థం ఇప్పటికే కొదురుపాకలో రైతు వేదిక కట్టాం. ఇప్పడు వారి పేర్ల స్మారకార్థం రూ.2కోట్లతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నా.. 9 నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని మంత్రి కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News