Thursday, January 23, 2025

హుస్నాబాద్ కు చేరుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు, బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఐటి పరిశ్రమలు పురపాలక, పట్టణ అభివృద్ధిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హుస్నాబాద్ కు చేరుకున్నారు.

Also Read: కర్ణాటకలో మతతత్వ పూనకం!

హుస్నాబాద్ పట్టణానికి చేరుకున్న మంత్రి కెటిఆర్ కు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హుస్నాబాద్ పట్టణంలో రూ.200 లక్షల నిధులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం, 225 లక్షల రూపాయలతో నిర్మించిన డిగ్రీ కాలేజ్, 100 లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్టీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్, 968 లక్షల రూపాయలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News