Monday, December 23, 2024

పొన్నాల ఇంటికి చేరుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కెటిఆర్ చేరుకున్నారు. పొన్నాలను మంత్రి కెటిఆర్ బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీలో బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన తీవ్ర కలత చెందారు. కెటిఆర్‌తో మరికొంత మంది నేతలు పొన్నాల ఇంటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నుంచి పొన్నాలకు టికెట్ ఖరారు కాకపోవడంతో ఆ పార్టీ రాజీనామా చేయడంతో పాటు విమర్శలు గుప్పించారు.  2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీ ఓడిపోయిందని, కానీ తనను రాజీనామా చేయించి బలి పశువుని చేసిందని, 2018లో కూడా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 12 ఏళ్ల పాటు మంత్రిగా పని చేశారు, ఆయనకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. టిపిసిసి అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News