ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణను ఎదుర్కొనేందుకు తన లాయర్ తో కలిసి మాజీ మంత్రి కెటిఆర్ బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, కెటిఆర్ ఒక్కరినే లోనికి అనుమతిస్తామని పోలీసులు లాయర్ ను అఢ్డుకున్నారు. దీంతో తన లాయర్ ను అనుమతిస్తేనే విచారణకు హాజరవుతానని కెటిఆర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..”నాతోపాటు లాయర్ ను విచారణకు అనుమతించాలి. లాయర్ తో విచారణకు వస్తే ఇబ్బంది ఏంటి?. తన లాయర్ ను ఎందుకు అనుమతించరు?. లాయర్ ముందే విచారణ చేయాలి. హైకోర్టులో తీర్పు పెండింగ్ లో ఉండగా.. మళ్లీ విచారణ ఎందుకు?. పట్నం నరేందర్ రెడ్డి విషయంలో పోలీసులు తప్పుడు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. పోలీసులపై నమ్మకం లేకనే లాయర్ తో వచ్చా. నా ఇంటిపై రైడ్స్ చేయాలని చూస్తున్నారు. ఎన్ని రైడ్స్ చేసినా.. డ్రామాలు చేసినా ఇబ్బంది లేదు” అని అన్నారు.