Sunday, January 19, 2025

ఇది ప్రభుత్వం చేసిన హత్య

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ, రైతు భరోసా అందకనే దేవ్‌రావు ఆత్మహత్య
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కెటిఆర్ ఆత్మహత్యలు వద్దంటూ
రైతన్నలకు విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైదుపూర్‌కు చెందిన జాదవ్ దేవరావు అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరిట రుణం ఉన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడ్డాడంటే, రుణభారం ఎంత మానసిక వేదనకు గురిచేసిందో అర్థమవుతోందన్నారు. అన్నదాత నిండు జీవితం బలికావడానికి ప్రభు త్వం రుణమాఫీ పేరిట చేసిన మహా మోసంతో పా టు రైతు వ్యతిరేక విధానాలే కారణమన్నారు. అ ప్పులు తీరక అన్నదాతలు బలవన్మరణాలకు పా ల్పడుతున్నా కాంగ్రెస్ సర్కారులో ఏమాత్రం చల నం లేదన్నారు.

అధికారంలోకి రాగానే రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి మాట తప్పడం, రైతు భరోసా ఎత్తకొట్టడం వల్లే దేవరావు బలయ్యారని, ఇది ఆత్మహత్య కానే కాదు.. ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే తెలంగాణ రైతాంగం భావిస్తుందని పేర్కొన్నారు. దేవరావు మరణానికి కారణమైన ఈ ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. రైతు కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు సాగులో, పంట దిగుబడిలో నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉండటం కాంగ్రెస్ సర్కారు చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News