Friday, October 18, 2024

మీరు ప్రారంభించకుంటే ప్రజలే ప్రారంభిస్తారు

- Advertisement -
- Advertisement -

గోపన్ పల్లి ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తైన ప్రారంభించకపోవటంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నల్లగండ్ల, గోపన్‌పల్లి, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, అందుకోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం వేగంగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసిందని, కేవలం దీన్ని ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. కానీ ఇప్పటికీ ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై అవగాహన లేని అసమర్థ ప్రభుత్వం,

నాయకత్వం ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని విమర్శించారు.గోపన్‌పల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు సిఎంకు సమయం లేకుండా పోయిందని, ఎందుకంటే ఆయన ఢిల్లీ చుట్టు షటిల్ సర్వీస్‌లు చేయటానికి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల ఇళ్ల చుట్టు తిరగటంలోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కన్నా కూడా వ్యక్తిగత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించారు. వెంటనే గోపన్ పల్లి ఫ్లై ఓవర్‌ను ప్రారంభించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే ఆ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించే పరిస్థితి వస్తుందని కెటిఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News