Monday, December 23, 2024

అబద్ధాలు చెప్పడంలో శిక్షణ ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోటి కొచ్చిన విమర్శలు చేయడంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర మంత్రులు ఒకరికి మించి ఒకరు అబద్దాలు మాట్లాడారని, పైగా ఒకే అబద్ధాన్ని ముగ్గురూ ఒక్కోలా చెప్పారని మండిపడ్డారు. ‘మోడీజీ కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమని, ముగ్గురు కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. తెలంగాణకు తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరైనట్టు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారని, మరో మంత్రి మన్సుక్ మాండవీయ మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదంటున్నారు.

ఇదే విషయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం కేవలం రెండు ప్రతిపాదనలే వచ్చాయని మాట్లాడుతున్నారని, ఇలా ఒకరి కొకరు పొంతన లేకుండా అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే కేంద్ర మంత్రులు అందరూ ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేందుకు ట్రెయినింగ్ ఇవ్వాలని సూచించారు. అదే విధంగా తెలంగాణలో ఉనికిలో లేని 9 మెడికల్ కాలేజీలు ఉన్నట్టుగా క్రియేట్ చేసిన కిషన్‌రెడ్డిపై మరిన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు చెప్పిన ముగ్గురు కేంద్రమంత్రుల్లో కిషన్‌రెడ్డి ఆపర మేథావి అని వ్యాఖ్యానించారు. ఇకపోతే, హైదారాబాద్‌లో గ్లోబల్ మెడికల్ సెంటర్ ఏర్పాటు గురించి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన కేవలం ఒట్టి మాటలేనని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News