Friday, November 15, 2024

నాకు సంబంధం లేదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చే స్తే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయి నా న్యాయపరంగా ఎదుర్కొంటామని బి ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం త్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను హీరోయిన్లను బెదిరించినట్లు మంత్రి ఆరోపించారని, హీరోయిన్లను బెదిరించాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి లీక్ వీరుడు అని, ఫోన్ ట్యాపింగ్‌పై నేరుగా మాట్లాడే ధైర్యం రేవంత్‌కు లేదని, అందుకే లీకు వీరుడు సీఎం లీకులు ఇస్తున్నారని ఆక్షేపించారు. కి రణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని అప్పటి తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ జరిగి ఉంటే అప్పుడు కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు మహేందర్ రెడ్డి, శివధర్ రెడ్డి, సజ్జనార్, రవి గుప్తా లాంటి అధికారులకు తెలియదా..? అని కెటిఆర్ ప్రశ్నించారు.

తన ఫోన్ నిఘాలో ఉందని ఆపిల్ సంస్థ గతంలో మెసేజ్ కూడా పంపిందని గుర్తు చేశారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్, కెపి వివేకానంద, అరికెపూడి గాంధీ, కార్తీక్‌రెడ్డిలతో కలిసి మీడియా కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోవాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి నిర్వహణ చేసే తెలివి లేదని, సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోయేలా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పదేళ్లుగా తాగునీటి కష్టాలు లేవని, కానీ ఇవాళ నగరంలో ట్యాంకర్ల దందా జోరుగా నడుస్తోందని విమర్శించారు.

సాగర్, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో, ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లోనూ నీళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని, ప్రజల గొంతు ఎండకుండా చర్యలు తీసుకోండని పేర్కొన్నారు. అవసరమైతే జలమండలి వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టారా చెప్పాలని డిమాండ్ చేశారు. పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి జల పరవళ్లు వస్తున్నాయని, సాగర్ నుంచి 14 టిఎంసిల నీరు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. మార్చి నెలలో హైదరాబాద్‌లో రెండు లక్షల ట్యాంకర్లు బుక్ చేసుకునే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ చెప్పారు. బిఆర్‌ఎస్‌పై కక్షతో నీటిని సముద్రంలోకి వదిలారని, దేశంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీని మించిన చెల్లని నోటు ఇంకా ఎక్కడైనా ఉందా..? అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. 218 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దానం అనర్హతపై ఆదివారంలోగా నిర్ణయం తీసుకోవాలి
గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిల సభ్యత్వాలు రద్దయి ఉప ఎన్నికలు రావడం ఖాయమని కెటిఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి ఎంఎల్‌ఎగా ఎన్నికై హస్తం పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించిన దానం నాగేందర్ వ్యవహారంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం వరకు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. అనర్హతా పిటిషన్లను మూడు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కెటిఆర్ గుర్తు చేశారు. ఒక పార్టీలో ఎన్నికై మరో పార్టీలో చేరిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారని, ఇప్పుడు ఇతర పార్టీల వారిని చేర్చుకుంటున్న ఎవరిని రాళ్లతో కొట్టాలన్న మందకృష్ణ మాదిగ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News