Friday, November 1, 2024

శ్వేతపత్రం కాదు.. శుద్ధ అబద్ధాల పత్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇది శ్వేతపత్రం కాదు, ప్రచార యంత్రం ద్వారా నడిచే శుద్ధ అబద్ధాలు, తప్పుడు సమాచారంతో నిండి న పత్రం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. అత్యంత విజయవంతమైన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించి నందుకు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. మీ ఎజెండాకు అనుగుణంగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను కలపడం, అస్పష్టం చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీ వంచనను కప్పిపుచ్చుకోరాదన్నారు. మీరు చెబుతున్నట్లుగా రాష్ట్రం కష్టా ల్లో ఉంటే, కొత్తగా ఎన్నికైన సిఎం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో కొత్త క్యాంపు కార్యాలయానికి ఎందుకు డబ్బు వృధా చేస్తున్నారు? న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ ఎందుకు నిర్మించాలను కుంటున్నారు? అని ప్రశ్నించారు. 100 రోజుల్లో ఆరు హామీల అమలుకు మీ ప్రాధాన్యత ఎందుకు లేదు?, 100 రోజుల నోటీసుకు కౌంట్‌డౌన్ మొదలైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News