Wednesday, January 22, 2025

ఏ విచారణకైనా సిద్ధం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసు పెడతా రా..? అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్ర భుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా..?.. బెంగళూ రు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా..? ఇక్క డి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా..? ఎం దుకు కేసు పెడతావు అంటూ కెటిఆర్ సిఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. కేసుపెడితే పెట్టుకో…ఎన్నికేసులు పెట్టినా భయపడేవారు ఎవరూ లేదని స్పష్టం చే శా రు. సిఎం ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా కాం గ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. రేవంత్‌రెడ్డి తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందుతా అంటే జైలుకు పోతా అని.. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేది లేదని పే ర్కొన్నారు.

రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఒక్కటవుతున్నాయని, ఆ రెండు పార్టీలు ఒక్కటై బిఆర్‌ఎస్‌ను ఖతం చేసేందుకు ప్రత్నిస్తున్నాయని ఆరోపించారు. తనను విచారించేందుకు అనుమతివ్వడం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని, తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడితే ఎదుర్కొంటానని వెల్లడించారు. ఫార్ములా- ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదే శీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో పా ర్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యా దవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వద్దిరా జు రవిచంద్రలతోకలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. విశ్వనగరాల సరసన హైదరాబాద్ ను చేర్చాలనే ఉద్దేశంతోనే ఫార్ములా- ఈ కారు రేసింగ్ ను ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. ఫార్ములా- 1 రేసింగ్‌ను నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీ పడతాయని,

అయితే, దానిని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవడం తో ఫార్ములా -ఈ రేసింగ్‌కు
మొగ్గు చూపామని వివరించారు. ఫార్ములా -1 రేసింగ్ తొలిసారి 1946లో జరిగిందని, ఈ రేస్ నిర్వహణకు అనేక దేశాలు పోటీపడతాయని చెప్పారు. భారత్‌లో ఫార్ములా-1 రేసింగ్ నిర్వహించాలని 2003లోనే చంద్రబాబు ఆశించారని, కానీ, నిర్వాహకులు సుముఖత చూపించకపోవడంతో సాధ్యం కాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మళ్లీ తాను వాళ్లతో మాట్లాడానని, అయినా ప్రయోజనం లేకపోయిందని, అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహించే ఫార్ములా- ఈ కారు రేసింగ్ నిర్వహించామని తెలిపారు. 1984లో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు ఢిల్లీలో జరిగాయని, వాటి కోసం రూ.70,608 కోట్లు ఖర్చు చేశారని కెటిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు ఈ రేస్ నిర్వహించాం
అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు ప్రభుత్వాలు ఖర్చు చేయడం సర్వసాధారణమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కామన్వెల్త్ క్రీడల కోసం ఒరిజినల్ కాస్ట్ కంటే 100 రెట్లకుపైగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని, దాంతో పోల్చుకుంటే ప్రస్తుతం నిర్వహణ వ్యయం దాదాపు పది.. పదిహేను రెట్లు పెరుగుతుందన్నారు. కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ కుంభకోణం గుర్తుకు వస్తదని పేర్కొన్నారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని గుర్తు చేశారు. కానీ, ఓ మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఫార్ములా- ఈ రేస్ నిర్వహిస్తే.. దానిపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. రేసు రద్దు చేసినందుకు సిఎం రేవంత్‌రెడ్డి, ఆయన నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖపై కేసు పెట్టాలని అన్నారు. తాము హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే.. రేవంత్‌రెడ్డి బ్యాడ్ ఇమేజ్ తెస్తున్నారని విమర్శించారు.

రూ.40 కోట్లు ఖర్చు చేస్తే, రూ.700 కోట్లు లాభం వచ్చింది
ఈ -రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోందని, అలాంటి నగరాల చెంతకు హైదరాబాద్‌ను చేర్చాలని తాము ప్రయత్నం చేశామన్నారు. ఫార్ములా -ఈ రేసులు లండన్ న్యూయార్క్, పారిస్, రోమ్, టోక్కో, మొనాకో వంటి నగరాల్లో జరుగుతున్నాయని, ఈ నగరాల సరసన మన నగరాన్ని విశ్వనగరంగా చూడాలన్న ఉద్దేశంతో పోటీ పడ్డామని తెలిపారు. ముందు వాళ్లు ఆసక్తి చూపలేదని, అయినప్పటికీ అన్ని విషయాలను చర్చించి, తప్పకుండా రావాలని పట్టుబడితే.. సియోల్‌ను, జోహెన్నెస్ బర్గ్‌ను తట్టుకుని మన హైదరాబాద్‌కు ఫార్ములా -ఈని తీసుకొచ్చామని కెటిఆర్ గుర్తు చేశారు.ఈ రేస్‌ను తాము ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదని, ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేసి, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చాలని తాము ఈ -రేస్‌ను ఒక అడుగుగా ప్రయత్నం చేశామని చెప్పారు.

wతెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా మార్చే ప్రయత్నం చేశామని తెలిపారు. ఈ రేసింగ్ ప్రపంచవ్యాప్తంగా 49 కోట్ల మంది చూస్తారని చెప్పారు. ఎలక్ట్రానిక్ వాహనాలకు మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్నోవేషన్, రేసింగ్‌కు హైదరాబాద్ వేదిక కావాలన్నదే ప్రధాన ఎంజెడా అని పేర్కొన్నారు. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ఇక్కడికి ఫార్ములా- ఈ రేసింగ్ తీసుకొచ్చాబమని తెలిపారు. 2023, ఫిబ్రవరిలో ఈ రేస్ నిర్వహించామని, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ మొత్తం ఖర్చు రూ.40 కోట్ల కంటే ఎక్కువ పెట్టలేదని, ప్రమోటర్ గ్రీన్ కో కంపెనీ రూ.100 కోట్లు పెట్టిందని వెల్లడించారు. మొత్తం 140 కోట్లు ఖర్చు చేస్తే, రూ.700 కోట్లు లాభం వచ్చిందని నెల్సన్ అనే సంస్థ రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. దాంతోపాటు ఎన్నో పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేల ఆకర్షించామన్నారు. మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ రూ. 9500 కోట్లు, హ్యుండయ్ 1400 కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పారు. బ్యాటరీ వెహికల్స్ కోసం కొత్త పాలసీ తెచ్చామని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచామని కెటిఆర్ గుర్తు చేశారు.

రేవంత్‌రెడ్డి ప్రపంచం ముందు రాష్ట్రం పరువు తీశారు
హెచ్‌ఎండిఎకు తెలియకుండా జరిగిందని మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం 2024 నవంబర్ 14న జిఒ కూడా ఇచ్చిందని కెటిఆర్ తెలిపారు. రేస్‌కు సంబంధించి హెచ్‌ఎండిఎకు సంపూర్ణ అవగాహన ఉందని అన్నారు. హెచ్‌ఎండిఎ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, కేబినెట్, ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ రేస్ నిర్వహణకు స్పాన్సర్లు తప్పుకున్నారని, మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందన్న నమ్మకంతో ఎన్నికల తర్వాత కొత్త స్పాన్సర్లను తీసుకోవచ్చనే ధీమాతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దని ఫార్ములా ఈకి నిధులు విడుదల చేయమని హెచ్‌ఎండిఎ కమిషనర్ అరవింద్ కుమార్‌కు తానే ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. హెచ్‌ఎండిఎ ఛైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చి డబ్బులు ఇవ్వాలని కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. ఆందుకు అనుగుణంగా ఆరవింద్ కుమార్ రూ. 55 కోట్లు చెల్లించారని చెప్పారు. ఇందులో అరవింద్ కుమార్ తప్పేమి లేదని అన్నారు.

హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, జీహెచ్‌ఎంసీ మూడు విభాగాలు అంతర్గతంగా డబ్బులను సర్దుబాటు చేసుకుంటాయని, ఇది రెగ్యులర్ జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తదని చెప్పారు. రేసు రద్దు చేయాలన్న రేవంత్‌రెడ్డి నిర్ణయంతో ఆ సంస్థకు లాభం జరిగి రాష్ట్రానికి నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. రేస్ వల్ల జరిగే లాభం రేవంత్ రెడ్డికి తెలియదని, ఆయన ఎవరు చెబితే వినరని అన్నారు. సిఎంకు కూలగొట్టుడు తప్ప నిర్మాణం తెలువని విమర్శించారు. పాజిటివ్ మనషులు కాదు అని..పిచ్చోళ్ల లాగా తన మీద కోపంతో రేస్‌ను రద్దు చేశారని మండిపడ్డారు. కెసిఆర్ గవర్నమెంట్‌లో ఫార్ములా ఈ రేస్ తీసుకొస్తే.. రేవంత్ రెడ్డేమో ఇంటర్నేషనల్ షేమ్ తెచ్చారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రపంచం ముందు రాష్ట్రం పరువు తీశారని, రేవంత్ రెడ్డి చేసిన తప్పు వల్ల 800 కోట్ల నష్టం వచ్చిందని కెటిఆర్ ధ్వజమెత్తారు.

మేఘా కృష్ణారెడ్డి ఇంటికి ఎసిబిని పంపే దమ్ముందా..?
మేఘా కృష్ణారెడ్డి ఇంటికి ఎసిబిని పంపే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. సుంకిశాల ఘటనలో అవినీతి కేసు పెట్టాల్సి వస్తే కృష్ణారెడ్డి పైనే పెట్టాలని అన్నారు. సుంకిశాల ఘటన ద్వారా రూ.80 కోట్లు నష్టం జరిగిందని అధికారులు నివేదిక ఇచ్చారని… మేఘాను బ్లాక్ లిస్టులో పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. ఎసిబి నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదని, తనకు న్యూస్ పేపర్ల నోటీసులే వస్తున్నాయని కెటిఆర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News