Saturday, January 18, 2025

ఈ-రేస్‌పై చర్చకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

కేబినెట్‌లో కాదు.. అసెంబ్లీలో చర్చకు పెట్టండి.. సమాధానం చెబుతా దమ్ముంటే సమావేశాలను
2-0 నిర్వహించాలి సిఎం పేరు మరిచిపోవడమే అల్లు అర్జున్ తప్పా?:

మన తెలంగాణ/హైదరాబాద్:ఈ ఫార్ములా రేస్‌కు సంబంధించిన వివాదాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సవా ల్ విసిరారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో కాకుం డా అసెంబ్లీలో చర్చిస్తే తాను సమాధానమిస్తానని వివరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొన్న కెటిఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పార్టీ నా యకులు దేశపతి శ్రీనివాస్,నవీన్ రెడ్డి, గోరేటి వెంకన్న, పొన్నాల లక్ష్మయ్య, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, లగచర్ల గురించి, గురుకుల పాఠశాలల నుంచి మొద లు కొని రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల సమస్యల పైన వారికి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పైన చర్చ పెట్టాలని అన్నారు. ప్రభుత్వం సమ యం ఇస్తే అన్ని సమస్యలపై చర్చించవచ్చని చె ప్పారు. కాంగ్రెస్ సర్కార్‌కు బిల్లుల ఆమోదంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు. పుష్ప 2 సక్సెస్ మీట్‌లో సీఎం పేరు మరచిపోవడమే అల్లు అర్జున్ చేసిన త ప్పా అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టిఆర్ ప్రశ్నించారు. సిఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా..?.. ఇదెక్కడి అన్యాయం అని నిలదీశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేంటని అడిగారు.

ఏడాదిలోపే వ్యతిరేకత
ఎక్కడైనా ప్రభుత్వంపై మూడు, నాలుగేళ్లకు వ్యతిరేకత వస్తుంది కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్ర భుత్వంపై ఏడాదిలోపే వ్యతిరేకత వచ్చిందని కెటిఆర్ ఆరోపించారు. అన్నీ అనుకూలిస్తే ప ట్నం నరేందర్ రెడ్డికేసులో త్వరగా తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. నరేందర్ రెడ్డికి, రైతులకు న్యాయం జరిగేలా అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. లగచర్ల అంశాన్ని రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని తెలిపారు. పట్నం నరేందర్ రెడ్డి వెంట నిలబడిన న్యాయవాదులు, పార్టీ కార్యకర్తలందరికీ కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి నక్క వినయాలు ప్రదర్శించి, అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని,

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ నుంచి మొదలుకొని అన్ని హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. రైతు రుణమాఫీ ఎక్కడా వంద శాతం పూర్తి కాలేదని, రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లె కానీ లేదా తెలంగాణలోని ఏ గ్రామంలోనైనా ఈ సవాల్‌కు సిద్ధమని చెబితే ముఖ్యమంత్రి పారిపోయారని చెప్పారు. తెలంగాణలో 30 శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదు కానీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ కార్యకర్త దాకా అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే రైతులు కచ్చితంగా కాంగ్రెస్‌కి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఒక్క ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని కెటిఆర్ విమర్శించారు. తమ పార్టీ అధినేత కెసిఆర్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తమ కార్యకర్తలనే తట్టుకోలేకపోతున్నారని, ఈయన స్థాయికి కెసిఆర్ అవసరంలేదని వ్యాఖ్యానించారు.

కొడంగల్ నుంచే బిఆర్‌ఎస్ జైత్రయాత్ర : కొడంగల్ నుంచే బిఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తరహాలో అందరమూ కదులుదామని కెటిఆర్ బిఆర్‌ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కొడంగల్ వచ్చి అక్కడి రైతుల బాధలు తెలుసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ కోలుకోదని వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలు అంటున్నారు… కాంగ్రెస్‌ను పంపేందుకు 2028 వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా రాదేమోనని వ్యాఖ్యానించారు.

కొడంగల్ పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత మాది
లగచర్ల భూములు గుంజుకోవాలన్న దుర్మార్గంతోనే రేవంత్ రెడ్డి కుటుంబం వ్యవహరిస్తుందని కెటిఆర్ మండిపడ్డారు. అందుకే ఫార్మా విలేజ్ రద్దు చేసుకున్నామని చెప్పి, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కొత్త నాటకంతో ముందుకు పోతుందని ఆరోపించారు. తిరుపతి రెడ్డి కనీసం వార్డ్ మెంబర్ కాదని, కానీ ఆయన పోలీసుల అండతో అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లో సేకరిస్తున్న రైతన్న భూములు పరిశ్రమల కోసం కానే కాదు అని, కేవలం రేవంత్‌రెడ్డి అల్లుడి కోసం, ఆదానీ కోసం అని పేర్కొన్నారు. పరిశ్రమలు పెట్టడం, ఉపాధి కల్పించడమే రేవంత్ రెడ్డి ప్రాధాన్యత అయితే వెల్దండలో ఉన్న 500 ఎకరాల భూమిలో పరిశ్రమలు పెట్టి ఉపాధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లగచర్ల అంశాన్ని వదిలిపెట్టమని, అసెంబ్లీ నడిచినన్నీ రోజులు లేవనెత్తుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన లగచర్ల రైతులను, పార్టీ నేతలను వెంటనే పోలీసులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్ పార్టీ శ్రేణులను కాపాడుకునే బాధ్యత తమది అని, రేవంత్ రెడ్డి అరాచకాలకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కెటిఆర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News