Tuesday, February 11, 2025

దాడి ఘటన వీడియోలున్నా.. ప్రభుత్వం ఏం చేస్తోంది?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన చాలా దారుణమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ధర్మరక్షకులు దాడులు చేస్తారు.. రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు. రంగరాజన్‌పై దాడిపై హిందూధర్మ పరిక్షకులు ఒక్క మాట మాట్లాడలేదు. దాడి ఘటన వీడియోలున్నా ప్రభుత్వం ఏం చేస్తోంది?. ముఖ్యమంత్రి, హోంమంత్రి సమాధానం చెప్పాలి” అని కెటిఆర్ డిమాండ్ చేశారు.

కాగా, పూజారి రంగరాజన్ పై వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి వచ్చి దాడి చేశారు. ఆయన ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి హల్ చల్ చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు వీర రాఘవరెడ్డిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News