- Advertisement -
హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనపై మంత్రి కెటిఆర్ స్పందించారు. బాలుడు మృతి చెందడం దురదృష్టకర మన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన ఘటనలో నాలుగేళ్ల బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘట నలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మున్సిపాలిటీలో వీధి కుక్కల సమస్యను వీలైనంత తర్వగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియం త్రణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు.
- Advertisement -