Monday, December 23, 2024

యూకేలో కెటిఆర్‌కు ఘన స్వాగతం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: యూకెకు చేరుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం, పలువురు ఎన్‌ఆర్‌ఐ కెటిఆర్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్షంగా కెటిఆర్ యూకె పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా ఆయా దేశాల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంఘాలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూలతల గురించి కెటిఆర్ వివరించనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు కెటిఆర్ యూకెలో పర్యటించనున్నారు.

గతేడాది మే 18 నుంచి 22 వరకు కెటిఆర్ లండన్‌లో పర్యటించిన సంగతి విదితమే. లండన్‌లో భారత హైకమిషన్ సమావేశంతో పాటు ప్రవాస భారతీయులు, యూకె ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేండ్ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్టాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News