Friday, November 15, 2024

మేము షాడో టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ తెలంగాణ భవన్ లో ఆదివారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని కెటిఆర్ అన్నారు. ఎక్కువ వేతనాలు ఇచ్చి, ఉద్యోగాలిచ్చిచెప్పుకోలేక పోయామన్నారు. ఓటమి మాకు కేవలం స్వీడ్ బ్రేకర్ మాత్రమే స్పష్టం చేశారు. వంద రోజుల్లో.. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

తాము షాడో టీమ్ ను ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం నాలుక మడత వేసిందన్నారు. ఆరు గ్యారెంటీలే కాదు.. కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. సుపరిపాలన అందిస్తారా.. కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్న కెటిఆర్, ప్రభుత్వం ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్నామని హెచ్చరించారు. యువత, ఉద్యోగాలు సహా కొన్ని విషయాల్లో తప్పులు ఉన్నాయి.. సరిచేసుకుంటామని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News