Wednesday, January 22, 2025

‘వంద తప్పుల’ మోడీ

- Advertisement -
- Advertisement -

అభియోగాలు

పట్టించుకోలేదు
జిఎస్‌టి
మీటర్లు
పెట్టాలని షరతు
 ృష్ణా జలాలపై నికృష్ట
రాజకీయాలు
తేల్చకపోవడం,
పాలమూరుకు జాతీయ
హోదా ఇవ్వకపోవడం
ధరలు పెంచడం

 పెట్రో
ధరల పెంపు
 కుల గణన చేయకపోవడం
 కొమ్ముకాయడం
 సంక్షేమంపై అక్కసు
చేస్తామని చెప్పి, పెద్ద
నోట్లను రద్దు చేయడం
మెడికల్ కళాశాలల
మంజూరులో వివక్ష
 చట్టానికి తూట్లు

మునుగోడులో శిక్ష తప్పదు
జూటా, జూమ్లా బిజెపిపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పట్ల బిజెపి కొనసాగిస్తు న్న వివక్ష.. బిజెపి చేసిన మోసం.. ఇచ్చిన వాగ్ధానాల భంగపాటు తదితర అంశాలపై ఆ పార్టీ గర్హిస్తూ టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మునుగోడు ప్రజల తరఫున ఒక ఛా ర్జ్‌షీట్‌ను శనివారం తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ము నుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని, ధనబలంతో కొనాలనుకుంటున్న జూ టా, జుమ్లా బిజెపిపై మొత్తం 21 అంశాలతో కూడిన చార్జీషీట్‌ను త యారు చేశామన్నారు. ఈ దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాలు అంతులేనివని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మొదలుకొని ఇప్పటివరకు ప్రతిక్షణం రాష్ట్రం పట్ల విపరీతమైన వ్యతిరేక ధోరణితో పనిచేస్తోందన్నా రు. అన్ని రంగాల్లో తెలంగాణకి చేసి న అన్యాయాలను దృష్టిలో పెట్టుకొ ని రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి తగిన శి క్ష విధిస్తారన్న నమ్మకం తమకుందన్నారు. మునుగోడు నియోజకవర్గానికి, మొత్తం తెలంగాణకు కేంద్రంలోని మోడీ సర్కార్ చేసిన మోసా లు, చూపిన వివక్షకు, ప న్నిన కుట్రలకు సరైన స మాధానంగా నవంబర్ 3 న జరుగనున్న ఉప ఎన్నికల్లో ము నుగోడు ఓటర్లు ఆ పార్టీ ఒక దోషిగా నిలబెట్టి, తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత కృష్ణుడు శిక్షించినట్లు.. ప్రజలు మోడీని ము నుగోడులో శిక్షిస్తారని తాను భావిస్తున్నానని చెప్పారు.

చార్జీషీట్‌లో

ఫ్లోరైడ్ బాధితులను పట్టించుకోనందుకు, ఫ్లోరోసిస్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేయనందుకు బిజెపి మీద మొదటి చార్జీ షీట్ వేస్తున్నామని కెటిఆర్ తెలిపారు.

బొక్కలు వంగి…బతుకులు కుంగి లక్షల మంది జీవచ్ఛవాలుగా మా రితే కేంద్రంలో అధికారం వెలగబెట్టిన బిజెపి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాటి ప్రధాని వాజ్‌పేయి వాజ్‌పేయి మీద ఫ్లోరైడ్ బాధితుడిని పడుకోబెట్టి, గోడు వెళ్లబోసుకున్నా కనికరించలేదన్నారు.

చేనేతపై పన్ను వేయడాన్ని నిరసిస్తూ రెండో చార్జీషీట్‌ను దాఖలు చేస్తున్నామన్నారు. చరిత్రలో తొలిసారి చేనేతపైన పన్నువేసి మగ్గానికి మరణశాసనం రాశాడన్నారు. ఈ రంగంపై 5 శాతం జిఎస్‌టిని విధించమే కాకుండా దానిని 12 శాతానికి పెంచాలని దుర్మార్గమైన ఆలోచన చేశారన్నారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధనలపై చార్జీషీట్‌ను రూపొందించామన్నారు. బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టాల్సిందే, నెలనెలా రైతు కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని రాష్ట్రాల మెడమీద కత్తిపెట్టి మోడీ సర్కార్ బెదిరిస్తోందనారు. ఉచిత విద్యుత్‌ను బంద్‌పెట్టి, బోరుబావుల కింద కరెంట్‌తో వ్యవసాయం చేసుకుంటున్న 30 లక్షల మంది రైతుల నోట్లో మట్టిగొట్టాలని కేంద్రం చూస్తున్నదన్నారు.

కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం చేస్తోందని కెటిఆర్ విమర్శించారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటాను తేల్చడం లేదన్నారు.

సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌కు రిఫర్ చెయ్యాలని 8 ఏండ్ల నుంచి కోరుతున్నా…అంతులేని జాప్యం చేస్తూ తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. కేంద్రం నిర్వాకం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాలు వందల టిఎంసిల నీళ్లను నష్టపోయినందుకు, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వనందుకు చార్జీషీటును వేస్తున్నామన్నారు.

వంట గదిలో సిలిండర్ మంటలు పెట్టి, ఆడబిడ్డల కంట కన్నీళ్లు తెప్పిస్తున్నది కేంద్రం చర్యలకు నిరసనగా చార్జీషీట్‌ను రూపొందించామన్నారు. 2014లో రూ. 410లు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1200లకు చేరుకుందన్నారు. ప్రపంచంలోనే సిలిండర్ కు అత్యధిక రేటు వసూలు చేస్తున్న పుణ్యాత్ముడు మోడీ అన్నారు. ఆయిల్ కంపెనీల నష్టాలకు రూ. 22 వేల కోట్ల పరిహారం ప్రకటించిన కేంద్రం ఆడబిడ్డలను ఆదుకునేందుకు సబ్సిడి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ చార్జీషీట్‌ను దాఖలు చేస్తామన్నారు.

ముడుచమురు ధర పెరగకపోయినా.. మోడీ చమురు ధర పెంచి.. పెట్రోల్, డీజీల్ ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచినందుకు వారి తరఫున చార్జీషీట్ వేస్తున్నామని కెటిఆర్ వివరించారు. అగే బిసి కులగణన చేయకుండా.. ఆయా వర్గాల మీద దొంగ ప్రేమ చూపిస్తున్న మోడీ ప్రభుత్వం మీద చార్జీ షీట్ వేస్తున్నామన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ.. పేదల సంక్షేమ పథకాలు పనికిరానివంటూ మోడీ చేస్తున్న వ్యాఖ్యలకు విరుద్ధంగా పేదల తరఫున ఈ చార్జీ షీట్ వేస్తున్నామన్నారు. ఇక ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేస్తున్నందుకు,

నల్లధనం తెస్తా అని చెప్పి.. పెద్ద నోట్లను రద్దు చేసి, సామాన్యులను కష్టపెట్టినందుకు సామాన్యుల పక్షానా చార్జీ షీట్ వేస్తున్నామని ఆయన వెల్లడించారు. టిఆర్‌ఎస్ మీద కక్షతో.. విద్యార్థుల కోసం మెడికల్ కళాశాలలు మంజూరు చేయనందుకు విద్యార్థుల తరఫున,

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయనందుకు, విభజన చట్టానికి తూట్లు పొడిచినందుకు, నల్ల చట్టాల పేరుతో రైతన్న నోట్లో సున్నం పెట్టేందుకు ప్రయత్నించినందుకు, తెలంగాణ ప్రజలను నూకలు తినమన్నందుకు, రైతులను అవమానించినందుకు రైతుల తరఫున చార్జీ షీట్ వేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు రూ. 55 లక్షల కోట్లు అయితే.. ఒక్క మోడీ చేసిన అప్పు 105 లక్షల కోట్లు చేసిందనకు…. పుట్టిన ప్రతి బిడ్డ మీద కూడా అప్పువేసినందుకు చార్జీ షీట్ వేస్తున్నామన్నారు. అలాగే దేశానికి లాభాలు తెచ్చే ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నందుకు చార్జీ షీట్ వేస్తున్నామన్నారు. ఇవన్నీ మచ్చుకు మాత్రమేనని…. ఇలా చెబుతూ చార్జీ షీట్ వేయాలంటే వందల కొద్ది ఉన్నాయని కెటిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News